
By election result: హుజూరాబాద్‌లో 3 రౌండ్ల ఫలితాలు.. ఆధిక్యంలో ఈటల
హైదరాబాద్: హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటి వరకు మూడు రౌండ్ల ఫలితాలు వెలువడ్డాయి. రెండు రౌండ్లలో ఆధిక్యం కనబరిచిన భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ మూడో రౌండ్‌లోనూ హవా కొనసాగిస్తున్నారు. మూడో రౌండ్ ముగిసేసరికి ఆయన 1,269 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. తాజాగా ఫలితాలు వెల్లడైన రౌండ్‌లో ఈటలకు 911 ఓట్లు ఆధిక్యం లభించింది. ఇక్కడ మొత్తం 22 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగనుంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.