AP News: పోలీసులపై గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్ర ఆగ్రహం

తెదేపా సీనియర్‌ నేత, రాజమహేంద్రవరం రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిని పోలీసులు అడ్డుకున్నారు.

Updated : 21 Oct 2021 12:50 IST

ఏలూరు: తెదేపా సీనియర్‌ నేత, రాజమహేంద్రవరం రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిని పోలీసులు అడ్డుకున్నారు. తన వాహనంలో రాజమహేంద్రవరం నుంచి అమరావతి వెళ్తుండగా ఏలూరు సమీపంలో ఆపేయడంతో పోలీసులపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతిభద్రతల సమస్య ఉందని పోలీసులు చెప్పినా బుచ్చయ్య చౌదరి వినిపించుకోలేదు. అమరావతి సచివాలయంలో పనుల నిమిత్తం వెళ్తున్న తనను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. ప్రజాప్రతినిధిగా అక్కడికి వెళ్లే హక్కు తనకు ఉందని.. అడ్డుకునేందుకు మీరెవరని పోలీసులను ఆయన నిలదీశారు. దమ్ముంటే తనను అరెస్ట్‌ చేసుకోవాలని.. ఇక్కడే కూర్చొంటానన్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని