Somireddy: ప్రజల ఆస్తులను కాజేసే పరిస్థితికి వైకాపా నేతలు దిగజారిపోయారు

వైకాపా నేతల ధనదాహానికి వ్యవస్థలు కూలుతున్నాయని తెదేపా సీనియర్‌ నేత సోమిరెడ్డి ఆరోపించారు. సర్వేపల్లిలో ప్రభుత్వ భూమి మాయం అవుతోందన్నారు

Updated : 24 Nov 2022 15:11 IST

నెల్లూరు: వైకాపా నేతల ధనదాహానికి వ్యవస్థలు కూలుతున్నాయని తెదేపా సీనియర్‌ నేత సోమిరెడ్డి ఆరోపించారు. సర్వేపల్లిలో ప్రభుత్వ భూమి మాయం అవుతోందన్నారు. ఇదంతా ఎమ్మెల్యే, అధికారులకు తెలియకుండానే జరుగుతుందా? అని ప్రశ్నించారు. ప్రభుత్వ భూమి, ప్రజల ఆస్తులను కాజేసే పరిస్థితికి వైకాపా నేతలు దిగజారిపోయారని ఆక్షేపించారు. చిల్లకూరులో 250 ఎకరాల ప్రభుత్వ భూమి ధారదత్తం చేశారని ధ్వజమెత్తారు. నెల్లూరు కాకుటూరులో రూ.60 కోట్ల విలువైన భూమి ఎలా మాయమైందని ప్రశ్నించారు. వీటిపై ఆగస్టు 4న ఫిర్యాదు చేసినా ఇప్పటికీ కేసు నమోదు కాలేదన్నారు. తహసీల్దార్‌ ఫిర్యాదు చేసినా ఎందుకు కేసు పెట్టలేదని ప్రశ్నించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని