AP News: సీఐడీని కక్ష సాధింపులకు వాడుకోవడం దారుణం: అయ్యన్న పాత్రుడు

ఏపీలో సీఐడీని కక్ష సాధింపులకు వాడుకోవడం దారుణమని మాజీ మంత్రి, తెదేపా సీనియర్‌ నేత అయ్యన్న పాత్రుడు మండిపడ్డారు.

Updated : 18 Dec 2021 12:46 IST

విశాఖ: ఏపీలో సీఐడీని కక్ష సాధింపులకు వాడుకోవడం దారుణమని మాజీ మంత్రి, తెదేపా సీనియర్‌ నేత అయ్యన్న పాత్రుడు మండిపడ్డారు. స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసులో మాజీ ఐఏఎస్‌ లక్ష్మీనారాయణకు సంబంధమేంటని నిలదీశారు. విశాఖలో అయ్యన్న పాత్రుడు మీడియాతో మాట్లాడారు. ఈ కేసులో నిధుల కేటాయింపునకు సంతకం చేసిన ప్రేమచంద్రారెడ్డిని వదిలేసి గంటా సుబ్బారావును అరెస్టు చేయడం అరాచకానికి పరాకాష్ఠగా ఆయన అభివర్ణించారు.

నైపుణ్యాభివృద్ధి కేంద్రం ఎందుకు పెట్టారో సీఎం జగన్‌కు తెలుసా అని ప్రశ్నించారు. అవినీతి సీఎం ఉంటే పరిశ్రమలు పెట్టేందుకు ఎవరొస్తారని అయ్యన్న విమర్శించారు. మన పిల్లలకు ఉద్యోగావకాశాలు ఎలా వస్తాయని నిలదీశారు. కార్యక్రమంలో తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌, తదితర తెదేపా నాయకులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని