Laxman: అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో సంచలన నిర్ణయాలు: లక్ష్మణ్‌

భాజపా అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో సంచలన నిర్ణయాలు ఉంటాయని ఆ పార్టీ ఎంపీ లక్ష్మణ్‌ అన్నారు.

Published : 14 Apr 2024 22:01 IST

హైదరాబాద్‌: కాంగ్రెస్‌, భారాస రెండూ తోడు దొంగలేనని భాజపా ఎంపీ లక్ష్మణ్‌ విమర్శించారు. భారాస పని అయిపోయిందని, మునిగిన పడవ అని ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌ రెడ్డి పాలన టీవీ సీరియల్‌ ఎపిసోడ్‌లా ఉందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశమవుతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు సూత్రధారులెవరో తేల్చాలని డిమాండ్‌ చేశారు. భాజపా మూడోసారి అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో సంచలన నిర్ణయాలు ఉంటాయని చెప్పారు. ఉమ్మడి పౌరస్మృతిని దేశంలో కచ్చితంగా అమలు చేస్తామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని