మిథున్‌ చక్రవర్తిపై ఈసీకి ఫిర్యాదు 

ప్రముఖ సినీనటుడు, భాజపా నేత మిథున్‌ చక్రవర్తిపై తృణమూల్‌ కాంగ్రెస్‌ ఈసీకి ఫిర్యాదు చేసింది. బెంగాల్‌లో ఎన్నికల నేపథ్యంలో ....

Published : 25 Apr 2021 02:01 IST

కోల్‌కతా: ప్రముఖ సినీనటుడు, భాజపా నేత మిథున్‌ చక్రవర్తిపై తృణమూల్‌ కాంగ్రెస్‌ ఈసీకి ఫిర్యాదు చేసింది. బెంగాల్‌లో ఎన్నికల నేపథ్యంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌, మిథున్‌ చక్రవర్తి కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించారని తృణమూల్‌ నేతలు ఆరోపించారు. దేశంలో కరోనా విజృంభిస్తున్న వేళ బెంగాల్‌లో మిగిలిన  రెండు విడతల ఎన్నికల ప్రచారంపై ఈసీ కఠిన ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. బహిరంగ సభలకు 500మందికి మించరాదని ఆదేశించింది. ఈ నేపథ్యంలో దిలీప్‌ ఘోస్‌, మిథున్‌ చక్రవర్తి దక్షిణ దినాజ్‌పూర్‌, మాల్దా జిల్లాల్లో ఈసీ ఆదేశాలు బేఖాతరు చేస్తూ సభలు నిర్వహించారని తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ సౌగతా రాయ్‌ ఆరోపించారు. వారిద్దరిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని ఈసీని కోరినట్టు చెప్పారు. అలాగే, చివరి దశ ఎన్నికల ప్రచారం కోసం బహిరంగ సభలు నిర్వహించకుండా నిషేధం విధించాలని కోరినట్టు చెప్పారు. ఎన్నికల సంఘం భాజపాకు అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఇద్దరు భాజపా నేతలపై శుక్రవారం, ఈ రోజు ఉదయం ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలూ తీసుకోవడంలేదన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని