Telangana news: అరాచకాలు మితిమీరిపోతున్నాయి.. ఇంట్లో దూరి కొట్టే రోజులొస్తాయి: రేవంత్‌రెడ్డి

తెలంగాణలో అన్నదాతలు పండించిన పంటను.. సీఎం కేసీఆర్‌ మెడలు వంచి కొనిపిస్తున్న ఘనత కాంగ్రెస్‌ పార్టీదేనని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. గాంధీభవన్‌లో

Published : 17 Apr 2022 01:58 IST

హైదరాబాద్: తెలంగాణలో అన్నదాతలు పండించిన పంటను.. సీఎం కేసీఆర్‌ మెడలు వంచి కొనిపిస్తున్న ఘనత కాంగ్రెస్‌ పార్టీదేనని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. గాంధీభవన్‌లో రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. పంట వేయక కొందరు, పంటను తక్కువ ధరకు అమ్ముకొని మరి కొందరు రైతులు నష్టపోయారన్నారు. పంట వేయక నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.15 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తక్కువ ధరకు ధాన్యాన్ని అమ్ముకున్న రైతులకు రూ. 600 బోనస్ ఇవ్వాలన్నారు. మిల్లర్లు, ప్రభుత్వం కలిసి రూ.3వేల కోట్ల కుంభకోణం చేశాయని ఆరోపించారు. ఎఫ్‌సీఐకి చెందిన బియ్యం మాయం అయ్యాయని.. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

‘‘తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ పర్యటన ఖరారైంది. మే 6న వరంగల్‌లో నిర్వహించనున్న బహిరంగ సభలో రాహుల్ పాల్గొంటారు. మే 7న హైదరాబాద్‌లో పార్టీ నాయకులతో సమావేశం అవుతారు. కేసీఆర్ అవినీతిని ఎండగట్టడానికే రాహుల్ గాంధీ వస్తున్నారు. మరో ఏడాదిలో తెలంగాణలో ఎన్నికలు రాబోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. ఖమ్మం మంత్రి పువ్వాడ అజయ్ అదుపులో ఉండాలి. జిల్లాలో ఆయన అరాచకాలు మితిమీరిపోతున్నాయి.
ఇంట్లో దూరి కొట్టే రోజులు వస్తాయి. కాంగ్రెస్‌ కార్యకర్తల మీద కేసులు పెట్టి శునకానందం పొందుతున్నారు. నిజాంకు పట్టిన గతే సీఎం కేసీఆర్‌కు పడుతుంది’’ అని రేవంత్‌ వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని