Telangana News: కేంద్రం ఆఖరి గింజ కొనే వరకూ విశ్రమించం: తెరాస

తెలంగాణలో యాసంగిలో రైతులు పండించిన ధాన్యం కొనుగోలుపై కేంద్రం నిర్లిప్త వైఖరి అవలంబిస్తోందని తెరాస

Updated : 07 Apr 2022 15:37 IST

హైదరాబాద్‌: తెలంగాణలో యాసంగిలో రైతులు పండించిన ధాన్యం కొనుగోలుపై కేంద్రం నిర్లిప్త వైఖరి అవలంబిస్తోందని తెరాస శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలతో హోరెత్తిస్తున్నాయి. మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రైతుబంధు సమితి ఛైర్మన్లు సహా ఇతర ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు జిల్లా కేంద్రాల్లో నిర్వహించిన నిరసనల్లో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కేంద్ర దిగొచ్చి మద్దతు ధరకు ఆఖరి గింజ కొనేవరకు అవిశ్రాంతంగా పోరాడతామని తెరాస నేతలు స్పష్టం చేశారు.

సిద్దిపేటలో మంత్రి హరీశ్‌రావు, సంగారెడ్డిలో తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, కరీంనగర్‌లో గంగుల కమలాకర్‌, నిజామాబాద్‌లో ప్రశాంత్‌రెడ్డి, నల్గొండలో జగదీశ్‌రెడ్డి, మహమూద్‌ అలీ, ఖమ్మంలో పువ్వాడ అజయ్‌, వరంగల్‌లో ఎర్రబెల్లి దయాకర్‌రావు, మేడ్చల్‌లో మల్లారెడ్డిలు నిరసనల్లో పాల్గొని కేంద్ర వ్యవహరిస్తున్న తీరుపై ధ్వజమెత్తారు. తక్షణం రాష్ట్ర రైతులను ఆదుకునేలా యాసంగి ధాన్యం కొనుగోలు చేయాలని నినదించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని