ఎన్‌హెచ్‌ఆర్సీకి వర్ల రామయ్య లేఖ

ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీలపై దాడులు జరుగుతున్నాయంటూ తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు లేఖ రాశారు

Published : 23 Jul 2020 13:43 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీలపై దాడులు జరుగుతున్నాయంటూ తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు లేఖ రాశారు. రాష్ట్రంలో అనాగరిక పాలన నడుస్తోందన్న ఆయన.. వైకాపా అధికారం చేపట్టిన నాటి నుంచి ఎస్సీలు, బీసీలు, మహిళలపై దాడులు పెరిగిపోయాయని ఆరోపించారు. రాష్ట్రంలో ఇసుక మాఫియా యథేశ్ఛగా కొనసాగుతోందనడానికి వరప్రసాద్‌పై జరిగిన దాడి ప్రత్యక్ష సాక్ష్యమని తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మానవహక్కుల కమిషన్‌ను వర్ల రామయ్య డిమాండ్‌ చేశారు. కొందరు అధికారులను వేకెన్సీ రిజర్వులో పెడుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, ఈ కారణంగా వారు 50శాతం జీతాలు కోల్పుతున్నారని లేఖలో వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని