నాకు మంచి భార్య కావాలి!

పెళ్లి చేయడానికి తమ కుమారుడు/కుమార్తెల ఫొటోలను తల్లిదండ్రులు మ్యాట్రిమోనీ సంస్థలకు ఇస్తుంటారు. తెలిసిన వారికి, మధ్యవర్తులకు సైతం అందజేస్తుంటారు. కానీ... తమిళనాడులోని మదురై నగరం విల్లుపురంలో ‘నాకు మంచి భార్య కావాలి

Updated : 28 Jun 2022 10:34 IST

మదురైలో ఊరంతా పోస్టర్లు

పెళ్లి కోసం యువకుడి వినూత్న ఆలోచన

మదురై: పెళ్లి చేయడానికి తమ కుమారుడు/కుమార్తెల ఫొటోలను తల్లిదండ్రులు మ్యాట్రిమోనీ సంస్థలకు ఇస్తుంటారు. తెలిసిన వారికి, మధ్యవర్తులకు సైతం అందజేస్తుంటారు. కానీ... తమిళనాడులోని మదురై నగరం విల్లుపురంలో ‘నాకు మంచి భార్య కావాలి’ అనే పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. ఎవరు వీటిని అతికించారు. అసలేంటీ కథ...?

విల్లుపురం వాసి జగన్‌ ఓ ప్రైవేటు కంపెనీలో మేనేజర్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం ఆయనకు 27 ఏళ్లు. అయిదేళ్లుగా పెళ్లి కోసం సంప్రదాయ విధానంలో ప్రయత్నించారు. ఒక్కటి కూడా సఫలం కాలేదు. ఎక్కేగడప దిగే గడపతో అలసిపోయారు. పార్ట్‌ టైం డిజైనర్‌గానూ పనిచేస్తున్న జగన్‌ వినూత్న ఆలోచనకు కార్యరూపం ఇచ్చారు. మంచి భాగస్వామి కోసం వెతుకుతున్నట్లు పట్టణమంతా పోస్టర్లు అతికించారు. వాటిలో తన ఫొటోతోపాటు పేరు, కులం, వేతనం, వృత్తి, కాంటాక్టు నంబరు, అడ్రస్‌ తదితర వివరాలన్నీ స్పష్టంగా ఉండేలా చూసుకున్నారు. ఇంటి నిర్మాణానికి చిన్నపాటి స్థలం కూడా తన పేరిట మీద ఉందని అందులో రాసుకొచ్చారు. ‘ఇప్పటివరకు వివిధ వాణిజ్య ప్రకటనల కోసం చాలా పోస్టర్లను రూపొందించా. ఈ క్రమంలోనే నాకోసం నేను ఎందుకు ఒక పోస్టర్‌ను డిజైన్‌ చేసుకోకూడదనే ఆలోచన వచ్చింది. వెంటనే అమలు చేశా. ఏదేమైనా... 90లలో పుట్టినవారికి ఇప్పుడు చాలా కష్టమైన కాలం నడుస్తోంది’ అంటూ జగన్‌ తన గోడును వెళ్లబోసుకున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని