ఆస్ట్రేలియాలో కత్తి దాడిలో భారత విద్యార్థి మృతి

ఆస్ట్రేలియాలో ఓ భారతీయ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. అతడిది హరియాణాలోని కర్నాల్ ప్రాంతం.

Published : 06 May 2024 16:33 IST

చండీగఢ్‌: కత్తి పోట్లకు గురై ఆస్ట్రేలియా (Australia)లో భారత విద్యార్థి నవ్‌జీత్ సంధు మృతి చెందారు. భారత విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణలో అతడు ప్రాణాలు కోల్పోయాడని మృతుడి బంధువు యష్‌వీర్ వెల్లడించారు. మెల్‌బోర్న్‌లో శనివారం రాత్రి జరిగిన ఘటనలో మరో విద్యార్థి గాయాలపాలయ్యారు.

అద్దె విషయంలో భారత్‌కు చెందిన కొందరు విద్యార్థులు ఘర్షణ పడుతుండగా.. వారిని ఆపేందుకు వెళ్లి నవ్‌జీత్ ప్రాణాలు కోల్పోయాడని యష్‌వీర్ తెలిపారు. ‘‘తాను ఉంటున్న ఇంటినుంచి వస్తువులు తెచ్చుకునేందుకు వెంట రావాలని సంధును అతడి స్నేహితుడు అడిగాడు. దాంతో ఇద్దరూ కలిసివెళ్లారు. తన స్నేహితుడు ఇంటి లోపలికి వెళ్లిన తర్వాత పెద్ద కేకలు వినిపించాయి. వారిమధ్య గొడవ జరుగుతుందని అర్థమై.. సంధు కూడా లోపలికి వెళ్లాడు. ఘర్షణ వద్దని వారిని వారించే ప్రయత్నం చేశాడు. అప్పుడే అతడి ఛాతిలోకి కత్తి దూసుకెళ్లింది’’ అని వెల్లడించారు. అతడిని తీసుకెళ్లిన మిత్రుడికి గాయాలయ్యాయని చెప్పారు.

దీని గురించి ఆదివారం ఉదయం తమకు సమాచారం అందిందని తెలిపారు. ఈ జులైలో నవ్‌జీత్ తను కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లాల్సిఉందని, ఇంతలోనే ఇలా జరగడంతో అంతా షాక్‌లో ఉన్నామని వాపోయారు. మృతదేహాన్ని సాధ్యమైనంత త్వరగా స్వదేశానికి రప్పించేందుకు కేంద్రప్రభుత్వం సహకరించాలని కోరారు. నవజీత్.. హరియాణాలోని కర్నాల్‌ ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఏడాదిన్నర క్రితం స్టడీ వీసాపై ఆస్ట్రేలియా వెళ్లారు. నిందితుడిది కూడా అదే ప్రాంతమని తెలుస్తోంది.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని