అణ్వాయుధాల కసరత్తు మొదలుపెట్టండి - సైన్యానికి పుతిన్‌ ఆదేశం

ఉక్రెయిన్‌ సమీపంలో అణ్వాయుధాల విన్యాసాలు మొదలుపెట్టాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ తన సైన్యాన్ని ఆదేశించారు.

Published : 06 May 2024 16:16 IST

మాస్కో: ఉక్రెయిన్‌పై సుదీర్ఘకాలంగా యుద్ధం కొనసాగిస్తోన్న రష్యా (Russia).. తమ లక్ష్యం నెరవేరేవరకూ దాడులు చేస్తామని చెబుతోంది. ఈ క్రమంలో అణ్వాయుధాల ప్రయోగానికీ వెనకాడబోమని హెచ్చరిస్తోంది. ఈనేపథ్యంలో మరింత దూకుడు పెంచిన అధ్యక్షుడు పుతిన్‌.. ఉక్రెయిన్‌ సమీపంలో అణ్వాయుధాల విన్యాసాలు మొదలుపెట్టాలని తన సైన్యాన్ని ఆదేశించారు.

‘విన్యాసాల్లో భాగంగా.. సన్నద్ధత కోసం పలు చర్యలు తీసుకుంటాం. వ్యూహాత్మక అణ్వాయుధాలను వినియోగిస్తాం’ అని రష్యా రక్షణశాఖ వెల్లడించింది. మరికొన్ని రోజుల్లోనే వీటి కసరత్తు మొదలవుతుందని తెలిపింది. రష్యాపై పాశ్చాత్య అధికారులు రెచ్చగొట్టే ప్రకటనలు, బెదిరింపుల నేపథ్యంలో తమ ప్రాంతీయ సమగ్రతను కాపాడేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. ఈ అణ్వాయుధ విన్యాసాల్లో గగనతల, నావికాదళాలు పాల్గొంటాయని ప్రకటించింది.

అక్కడికి వెళ్తే.. ఇంటికి తిరిగి వెళ్లినట్టుగా ఉంటుంది: సునీతా విలియమ్స్‌

వ్యూహాత్మక అణ్వాయుధాల విన్యాసాలు సాధారణమే అయినప్పటికీ యుద్ధం వేళ వీటి కసరత్తుపై రష్యా బహిరంగ ప్రకటన చేయడం ఇదే తొలిసారి. ఉక్రెయిన్‌ మిత్ర దేశాలు చేస్తోన్న రెచ్చగొట్టే ప్రకటనలకు దీటుగా పుతిన్‌ నుంచి ఈ వార్నింగ్‌ వచ్చినట్లు తెలుస్తోంది. రెండేళ్లకుపైగా కొనసాగుతోన్న యుద్ధం.. రష్యా-నాటో మధ్య ఘర్షణకు దారితీయవచ్చని పాశ్చాత్య దేశాలు గతంలో ఆందోళన వ్యక్తంచేసిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని