తాజ్‌మహల్‌ 22 గదులు తెరిపించాలంటూ హైకోర్టులో వ్యాజ్యం

తాజ్‌మహల్‌ చరిత్రపై నిజ నిర్ధారణకు గాను విచారణ జరిపించాలని కోరుతూ అలహాబాద్‌ హైకోర్టులో భాజపా అయోధ్య యూనిట్‌ మీడియా ఇన్‌ఛార్జి రజనీశ్‌ సింగ్‌ శనివారం వ్యాజ్యం దాఖలు చేశారు.

Updated : 09 May 2022 12:12 IST

లఖ్‌నవూ: తాజ్‌మహల్‌ చరిత్రపై నిజ నిర్ధారణకు గాను విచారణ జరిపించాలని కోరుతూ అలహాబాద్‌ హైకోర్టులో భాజపా అయోధ్య యూనిట్‌ మీడియా ఇన్‌ఛార్జి రజనీశ్‌ సింగ్‌ శనివారం వ్యాజ్యం దాఖలు చేశారు. ఈమేరకు లఖ్‌నవూ బెంచ్‌ రిజిస్ట్రీలో వ్యాజ్యం దాఖలు చేశారు. రిజిస్ట్రీ దీన్ని అనుమతించిన అనంతరం విచారణకు న్యాయస్థానం ముందుకు వెళుతుంది. ‘‘వాస్తవం ఏదైనా సరే తెలుసుకోవడానికి తాజ్‌మహల్‌కు చెందిన మూసిఉన్న 22 గదుల తలుపులు తెరిపించాలి’’ అని వ్యాజ్యంలో కోరినట్లు పిటిషనర్‌ ఆదివారం ‘పీటీఐ’కి తెలిపారు. చారిత్రక స్మారకాలు, పురావస్తు ప్రాంతాలు వంటివాటికి సంబంధించి 1951, 1958 చట్టాల్లోని కొన్ని నిబంధనలను కూడా పక్కనపెట్టాలని రజనీశ్‌ సింగ్‌ పిటిషన్‌లో కోరారు. ఈ చట్టాల పరిధిలోనే తాజ్‌మహల్‌, ఆగ్రా కోట వంటివాటిని చారిత్రక స్మారకాలుగా ప్రకటించారు. మొఘలుల నాటి కట్టడమైన తాజ్‌మహల్‌ ‘ఆర్కియాలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా’ సంరక్షణలో ఉంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని