Published : 06 Jul 2022 06:04 IST

రాజకీయాలకు దూరంగా ఉందాం

పాక్‌ సైన్యం, ఐఎస్‌ఐలకు సూచనలు

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ సైన్యం, గూఢచార సంస్థ ఐఎస్‌ఐకి చెందిన అధికారులంతా రాజకీయాలకు దూరంగా ఉండాలని పాక్‌ ప్రధాన సైన్యాధికారి జనరల్‌ ఖమర్‌ జావేద్‌ బాజ్వా, ఐఎస్‌ఐ డైరెక్టర్‌ జనరల్‌ నదీమ్‌ అంజుమ్‌ సోమ, మంగళవారాల్లో వ్యక్తిగత సూచనలు జారీ చేశారు. పంజాబ్‌ ప్రావిన్సు శాసనసభలోని 20 స్థానాలకు ఈ నెల 17న ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో తమను దెబ్బతీసి పాకిస్థాన్‌ ముస్లింలీగ్‌ - నవాజ్‌ (పీఎంఎల్‌-ఎన్‌)ను, దాని సంకీర్ణ భాగస్వాములను గెలిపించాలని పాక్‌ సైన్యం, ఐఎస్‌ఐ కుట్ర పన్నుతున్నాయని మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌, ఆయన పార్టీ పాకిస్థాన్‌ తెహ్రీకే ఇన్సాఫ్‌ (పీటీఐ) నాయకులు సామాజిక మాధ్యమాల్లో దుమారం రేపుతున్నారు. ఈ నేపథ్యంలో తమ అధికారులు రాజకీయాలకు దూరంగా ఉండాలని సైన్యం, ఐఎస్‌ఐలు సూచించాయి.

Read latest Related stories News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని