Drones: డ్రోన్ల ధ్రువీకరణ పథకంపై కేంద్ర నోటిఫికేషన్‌ జారీ

కనీస భద్రత, నాణ్యత ప్రమాణాల సాధన లక్ష్యంగా ‘డ్రోన్ల ధ్రువీకరణ పథకం’పై పౌర విమానయాన మంత్రిత్వ శాఖ బుధవారం నోటిఫికేషన్‌ వెలువరించింది. 

Published : 27 Jan 2022 10:35 IST

దిల్లీ: కనీస భద్రత, నాణ్యత ప్రమాణాల సాధన లక్ష్యంగా ‘డ్రోన్ల ధ్రువీకరణ పథకం’పై పౌర విమానయాన మంత్రిత్వ శాఖ బుధవారం నోటిఫికేషన్‌ వెలువరించింది. దేశీయంగా తయారీని ప్రోత్సహించడానికి సరళీకృత నిబంధనలు ఉపయోగపడతాయని ఆ శాఖ తెలిపింది. డ్రోన్లకు ధ్రువీకరణను సులభంగా, త్వరగా, పారదర్శకంగా ఇచ్చేందుకు ఇవి దోహదపడతాయని పేర్కొంది. డిజిటల్‌ స్కై అనే ఏక గవాక్ష విధానం, ఉత్పత్తితో ముడిపడిన ప్రోత్సాహకాలు (పీఎల్‌ఐ) వంటివి డ్రోన్ల తయారీ పరిశ్రమ ఎదుగుదలకు ఉపకరిస్తాయని తెలిపింది. దిగుమతిదారులకు, విడి భాగాలను తెచ్చి ఒక్కటిగా అమర్చేవారికి కూడా నోటిఫికేషన్లో పేర్కొన్న అంశాలు వర్తిస్తాయని వెల్లడించింది. డ్రోన్‌కు ధ్రువపత్రం కావాలని దరఖాస్తు చేసేవారు దాని బరువు, రకం, వేగం, పరిధి, మన్నిక, బ్యాటరీ పనితీరు, డ్రోన్‌ను వెనక్కి రప్పించే యంత్రాంగం, తయారీలో వాడిన సామగ్రి గురించి వివరాలన్నీ సమర్పించాల్సి ఉంటుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని