అయోధ్య రామాలయంలో కీలక నిర్మాణ పనుల ఆరంభం

అయోధ్య రామాలయ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మూడోదశలో భాగంగా ప్రధాన నిర్మాణానికి సంబంధించిన పునాది పనులు ఆరంభమయ్యాయి.

Published : 28 Jan 2022 10:21 IST

దిల్లీ: అయోధ్య రామాలయ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మూడోదశలో భాగంగా ప్రధాన నిర్మాణానికి సంబంధించిన పునాది పనులు ఆరంభమయ్యాయి. ఒక్కోటి 2.50 టన్నుల బరువుండే మొత్తం 17 వేల గ్రానైట్‌ రాళ్లను ఇందుకు వినియోగిస్తుండటం విశేషం. మే నాటికి ఈ పనులు పూర్తవుతాయని ఆలయ ట్రస్టు గురువారం వెల్లడించింది. ప్రణాళిక ప్రకారమే ఆలయ పనులు జరుగుతున్నాయని, 2023 డిసెంబరు నాటికి భక్తులు ఇక్కడ శ్రీరాముడిని దర్శించుకునే భాగ్యం కలుగుతుందని పేర్కొంది. మూడోదశలో వేస్తున్న పునాదిపైనే ఆలయ ప్రధాన నిర్మాణం కొలువుదీరనుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని