Andhra News: మహాలక్ష్మమ్మ మాట చద్దన్నం మూట!

వందేళ్లు నిండిన మహాలక్ష్మమ్మను మునిమనవళ్లతో కలిసి కుటుంబ సభ్యులంతా ఎంతో ఘనంగా సత్కరించుకున్నారు.

Updated : 23 Feb 2022 09:35 IST

వందో పుట్టిన రోజున ఆరోగ్య రహస్యం చెప్పిన వృద్ధురాలు 

తాళ్లరేవు, న్యూస్‌టుడే: వందేళ్లు నిండిన మహాలక్ష్మమ్మను మునిమనవళ్లతో కలిసి కుటుంబ సభ్యులంతా ఎంతో ఘనంగా సత్కరించుకున్నారు. ఆమెతో సరదాగా కాలక్షేపం చేసి ఆరోగ్య రహస్యాలు తెలుసుకున్నారు. తన బలగం అంతా కళ్లముందు కదలాడటంతో ఆ బామ్మ సంతోషంతో ఉక్కిరిబిక్కరయ్యింది. తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలం కోరంగి పంచాయతీ పరిధిలోని చినబొడ్డు వెంకటాయపాలెంకు చెందిన కొపనాతి మహాలక్ష్మమ్మ మంగళవారం శత వసంతాల వేడుక జరుపుకొంది. ఆమె కుమారులు సత్యానందరావు, బాలకృష్ణ, హేమసుందరరావు, వెంకటేశ్వర్లు, కుమార్తె నూకరత్నం, మనవళ్లు, మనవరాళ్లు, ముని మనవళ్లు, ముని మనవరాళ్లు మొత్తం 32 మంది ఆమె జన్మదినాన్ని ఓ పండుగలా నిర్వహించారు. ఆమెకు కిరీటం అలంకరించారు. పూలమాలలతో సత్కరించారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడిన మహాలక్ష్మమ్మ ‘చద్దన్నం, రాగి జావ తినడం, తన పని తానే చేసుకోవడం, ఉమ్మడి కుటుంబంలో చక్కటి జీవనశైలి తన ఆరోగ్య రహస్యం’ అని చెప్పుకొచ్చారు. ఇప్పటికీ చూపు సక్రమంగా ఉందని.. రోజూ 2 గంటల పాటు పిల్లలతో కాలక్షేపం చేస్తూ సంతోషంగా ఉంటున్నానని చెప్పారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని