డ్రైవింగ్‌ స్కూల్‌ బామ్మ!

ఏడు పదులు దాటిన వయసులో అలవోకగా పలు వాహనాలు నడుపుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు

Updated : 15 Mar 2022 11:36 IST

ఏడు పదులు దాటిన వయసులో అలవోకగా పలు వాహనాలు నడుపుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు కేరళలోని ఎర్నాకులం జిల్లాకి చెందిన రాధామణి. 72 ఏళ్ల ఆమె చేతిలో 11 రకాల డ్రైవింగ్‌ లైసెన్స్‌లు ఉన్నాయి. కారు, భారీ ట్రక్కులే కాదు.. ప్రొక్లయినర్లు, క్రేన్లను కూడా పరుగులు పెట్టించగలరు. కొచ్చిలోని తోప్పంపాడిలో డ్రైవింగ్‌ స్కూల్‌ నడుపుతున్న ఈమె వందల మందికి డ్రైవింగ్‌ నేర్పించారు. ఇప్పటికీ నేర్పిస్తున్నారు. వయసు సహకరించి ఉంటే విమాన పైలట్, లోకో పైలట్‌ వంటి లైసెన్స్‌లు కూడా సంపాదించేదాన్నని అంటున్నారు. స్థానికులు ఆమెను మణమ్మ అని ముద్దుగా పిలుస్తారు. 1991లో భర్త ప్రోత్సాహంతో తొలుత కారు నేర్చుకున్నానని, ఆ సమయంలో గ్రామస్థులు హేళన చేసేవారని చెప్పారు. అవేమీ పట్టించుకోకుండా పట్టుదలతో అన్నిరకాల వాహనాల డ్రైవింగ్‌ నేర్చుకున్నట్టు చెప్పారు. అప్పట్లో కేరళలో హెవీ డ్రైవింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లు ఉండేవి కావని, ప్రభుత్వంతో న్యాయపోరాటం చేసి తనే ఒక హెవీ వెహికల్‌ డ్రైవింగ్‌ ఇనిస్టిట్యూట్‌ని ఏర్పాటుచేసినట్టు వివరించారు. మహిళలను డ్రైవింగ్‌లో ప్రోత్సహిస్తున్నానని, ఈ రంగంలో మహిళలకు అనేక ఉపాధి అవకాశాలు ఉన్నాయని చెప్పారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని