Tipu Sultan: రూ.6.27 కోట్లు పలికిన ‘టిప్పు’ చిత్రం

మైసూరు పాలకుడు హైదర్‌ అలి, అతని తనయుడు టిప్పు సుల్తాన్‌ 1780లో

Updated : 31 Mar 2022 09:40 IST

లండన్‌: మైసూరు పాలకుడు హైదర్‌ అలి, అతని తనయుడు టిప్పు సుల్తాన్‌ 1780లో నాటి ఈస్టిండియా కంపెనీపై సాధించిన చారిత్రక విజయానికి చిత్రరూపమిచ్చిన కళాఖండాలు బుధవారం లండన్‌లో రూ.6.27 కోట్ల (6,30,000 పౌండ్లు) భారీ మొత్తానికి అమ్ముడుపోయాయి. 242 ఏళ్ల కిందట సెప్టెంబరు పదో తేదీన జరిగిన రెండో ఆంగ్లో - మైసూరు యుద్ధమిది. ‘ది బ్యాటిల్‌ ఆఫ్‌ పోలిలుర్‌’గా పేరొందిన ఈ యుద్ధం చిత్రాలు లండన్‌లోని సదబీస్‌ ఆక్షన్‌ హౌస్‌లో ఇస్లామిక్‌ వరల్డ్‌ అండ్‌ ఇండియా విభాగంలో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. స్ఫూర్తిదాయకమైన ఈ విజయం కలకాలం గుర్తుండేలా టిప్పు సుల్తాన్‌ స్వయంగా ఈ చిత్రాలు గీయించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని