WhatsApp : వాట్సప్‌లో కొత్త ఫీచర్లు.. ఒకేసారి 32 మందికి గ్రూప్‌ కాల్‌

వాట్సప్‌ మరిన్ని ఫీచర్లతో ముందుకొస్తోంది. త్వరలోనే వాట్సప్‌లో మరిన్ని ఫీచర్లు జోడించనున్నట్టు ఆ యాప్‌ యాజమాన్య సంస్థ మెటా ప్లాట్‌ఫార్మ్స్‌ సీఈవో మార్క్‌ జుకెర్‌బర్గ్‌ గురువారం ఓ పోస్టులో వెల్లడించారు.

Updated : 15 Apr 2022 12:14 IST

దిల్లీ: వాట్సప్‌ మరిన్ని ఫీచర్లతో ముందుకొస్తోంది. త్వరలోనే వాట్సప్‌లో మరిన్ని ఫీచర్లు జోడించనున్నట్టు ఆ యాప్‌ యాజమాన్య సంస్థ మెటా ప్లాట్‌ఫార్మ్స్‌ సీఈవో మార్క్‌ జుకెర్‌బర్గ్‌ గురువారం ఓ పోస్టులో వెల్లడించారు. గ్రూప్‌ కాల్‌లో ఒకేసారి 32 మంది పాలుపంచుకునేందుకు అవకాశం కల్పించనున్నామని, 2 గిగాబైట్ల పరిమాణంలోని ఫైళ్లను షేర్‌ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తామని వాట్సప్‌ ప్రతినిధులు తెలిపారు. ప్రస్తుతం గ్రూప్‌ వాయిస్‌కాల్‌లో గరిష్ఠంగా 8 మంది మాత్రమే పాల్గొనే అవకాశముంది. ఒక గిగాబైట్‌ మించని ఫైళ్లను మాత్రమే ఇప్పటివరకూ ఈ వేదికలో షేర్‌ చేసుకోవడం వీలవుతోంది. గ్రూప్‌లోని అడ్మినిస్ట్రేటర్‌ ఎప్పుడైనా మెసేజ్‌లను తొలగించే ఫీచర్‌ను కూడా వాట్సప్‌ అందుబాటులోకి తీసుకురానుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని