Adhir Bhagwanani: ఆరు పదుల వయసులో మోడలింగ్‌..

అధీర్‌ భగవ్‌నానీ.. భారతీయ మోడలింగ్‌ రంగంలో నయా సూపర్‌స్టార్‌. దిగ్గజ సంస్థల ప్రకటనలలో ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తోంది ఈయనే.

Updated : 21 Apr 2022 11:03 IST

అధీర్‌ భగవ్‌నానీ.. భారతీయ మోడలింగ్‌ రంగంలో నయా సూపర్‌స్టార్‌. దిగ్గజ సంస్థల ప్రకటనలలో ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తోంది ఈయనే. ఛత్తీస్‌గఢ్‌ రాయ్‌పుర్‌లోని బారోన్‌ బజార్‌కు చెందిన 62 ఏళ్ల అధీర్‌ భగవ్‌నానీకి గతేడాది వరకు మోడలింగ్‌ ప్రపంచంతో సంబంధమే లేదు. కుటుంబ వ్యాపారాలు చూసుకోవడమే ఆయన పని. ఉక్కు, స్టీల్‌ వ్యాపారం చేసేవారు. ఓ పరిశ్రమ నడిపేవారు. అలా అనేక దశాబ్దాలుగా సాగిపోతున్న ఆయన జీవితం 2021 జులైలో అనూహ్య మలుపు తిరిగింది. ఇందుకు కరోనా లాక్‌డౌన్‌ కూడా కారణమంటారు అధీర్‌. ఈటీవీ భారత్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తన రెండో ఇన్నింగ్స్‌ ఎలా మొదలయిందో వివరించారు అధీర్‌.

‘‘ఇంతకుముందు నా గడ్డం చిన్నగా ఉండేది. కరోనా లాక్‌డౌన్‌ సమయంలో క్షౌరశాలలు మూతపడ్డాయి. కటింగ్‌ చేయించడం కుదరక.. గడ్డం పెరిగింది. అదే లుక్‌ కొనసాగించా. 2021 జులైలో నా భార్యను తీసుకొద్దామని మార్కెట్‌కు వెళ్లి కారులో ఎదురుచూస్తున్నా. ఓ వ్యక్తి వచ్చి అద్దంపై కొట్టి, నాతో మాట్లాడాడు. మోడలింగ్‌ చేసేందుకు అవకాశం ఇస్తానని చెప్పాడు. నేనే ఎందుకు అని అడిగితే.. మీ గడ్డం బాగుంది అన్నాడు. ఇదేదో బాగుంది కదా అని తర్వాత అతడిని కలిశా. అలా మోడలింగ్‌ మొదలుపెట్టా. మళ్లీ వెనుదిరిగి చూడలేదు. దిల్లీలోని నా స్నేహితుడి కుమారుడు, కోడలు ఫ్యాషన్‌ రంగంలో ఉన్నారు. దీంతో వారితో మాట్లాడా. మోడలింగ్‌లో నాకు ఎలాంటి అవకాశాలు ఉన్నాయో వారు చెప్పారు. వారి ద్వారానే రేమండ్‌ యాడ్‌కు, మరో మేగజైన్‌కు పనిచేశా’’ అని వివరించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని