రష్యా గతే మీకూ పడుతుంది.. చైనాకు అమెరికా హెచ్చరిక

రష్యాకు మద్దతివ్వడం మానుకోవాలని చైనాకు తీవ్రస్థాయిలో అమెరికా హెచ్చరికలు

Updated : 24 Apr 2022 12:48 IST

బ్రసెల్స్‌: రష్యాకు మద్దతివ్వడం మానుకోవాలని చైనాకు తీవ్రస్థాయిలో అమెరికా హెచ్చరికలు జారీ చేసింది. లేకపోతే మాస్కోకు పట్టిన గతే బీజింగ్‌కూ పడుతుందని పరోక్షంగా క్రెమ్లిన్‌పై విధించిన ఆంక్షలను ప్రస్తావించింది. పుతిన్‌కు సహకారం ఆపకపోతే ఆంక్షలు విధించడానికి వెనుకాడబోమని స్పష్టం చేసింది. ‘‘ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ఖండించడంలో చైనా విఫలమైంది. మానవ హక్కుల మండలి నుంచి రష్యాను తప్పించాలని తెచ్చిన తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేసింది. పరిస్థితిని మెరుగుపరచడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. మాస్కోపై ఎలాంటి ఆంక్షలు, ఎగుమతి నియంత్రణలు విధించామో చైనా చూసింది. రష్యాకు బీజింగ్‌ భౌతికపరమైన మద్దతిస్తే ఆ ఆంక్షల్లో కొన్నింటి రుచి చైనాకూ చూపిస్తాం’’ అని అమెరికా డిప్యూటీ సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ వెండీ షెర్మన్‌  తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు