మరోసారి చిక్కుల్లో బ్రిటన్‌ ప్రధాని

కరోనా ఉద్ధృతంగా ఉన్న సమయంలో నిబంధనలు ఉల్లంఘించి మద్యంతో విందులు చేసుకున్న బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ను ఆ వివాదం ఇంకా వెంటాడుతూనే ఉంది. ‘పార్టీ గేట్‌’ కుంభకోణంగా పిలుస్తున్న ఈ వ్యవహారానికి సంబంధించిన కొన్ని చిత్రాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.

Updated : 25 May 2022 06:14 IST

‘కొవిడ్‌ వేళ.. పార్టీ’ చిత్రాలు తాజాగా వెలుగులోకి

లండన్‌: కరోనా ఉద్ధృతంగా ఉన్న సమయంలో నిబంధనలు ఉల్లంఘించి మద్యంతో విందులు చేసుకున్న బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ను ఆ వివాదం ఇంకా వెంటాడుతూనే ఉంది. ‘పార్టీ గేట్‌’ కుంభకోణంగా పిలుస్తున్న ఈ వ్యవహారానికి సంబంధించిన కొన్ని చిత్రాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. కరోనా రెండోదశ ఉద్ధృతి సమయంలో 2020 నవంబరు 13న ఓ వీడ్కోలు పార్టీలో చేతిలో మద్యం గ్లాసు పట్టుకొని ఉన్న బోరిస్‌ చిత్రాలను తాజాగా ఐటీవీ న్యూస్‌ ఛానల్‌ విడుదల చేసింది. ఈ ఘటనకు సంబంధించి ప్రధానికి జరిమానా ఎందుకు విధించలేదని లండన్‌ మేయర్‌ సాదిక్‌ఖాన్‌ సహా ప్రతిపక్ష లేబర్‌ పార్టీ నాయకులు మెట్రోపాలిటన్‌ పోలీసులను వివరణ కోరారు. ‘‘నవంబరు 13న ఏ పార్టీ జరగలేదని గతంలోప్రధాని బోరిస్‌ పార్లమెంటులో చెప్పారు. తాజాగా ఫొటోలు లీకైన నేపథ్యంలో ఇప్పుడు ఏం సమాధానం చెబుతారు? అధికార కన్జర్వేటివ్‌ పార్టీ ఎంపీలు ఆయనను పదవి నుంచి తప్పించాలి’’ అని లేబర్‌ పార్టీ పిలుపునిచ్చింది. ఆంక్షల వేళ జరిగిన పార్టీలపై సీనియర్‌ అధికారి స్యూ గ్రే బుధవారం తన నివేదికను ప్రధాని కార్యాలయానికి సమర్పించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ బీబీసీ కథనం వెల్లడించింది. నివేదిక వచ్చా.
క.. ఈ అంశంపై బోరిస్‌  పార్లమెంటులో మాట్లాడతారని ఆయన కార్యాలయ ప్రతినిధి వెల్లడించారు.

* కొవిడ్‌ మహమ్మారి సమయంలో బ్రిటన్‌ ప్రధాని నివాసం, ప్రభుత్వ కార్యాలయాల్లో నిబంధనలకు విరుద్ధంగా జనాలు పోగైన 12 కార్యక్రమాలపై ‘ఆపరేషన్‌ హిల్‌మన్‌’ పేరుతో పోలీసు విచారణ ఇప్పటికే పూర్తయింది. 83 మందికి 123 జరిమానా నోటీసులు జారీ అయ్యాయి. 2020 జూన్‌లో తన పుట్టినరోజు విందు నేపథ్యంలో ప్రధాని బోరిస్‌ జాన్సన్‌, ఆయన భార్య క్యారీ, ఆర్థికమంత్రి రిషిసునక్‌ తదితరులు ఒకటి చొప్పున నోటీసులు అందుకున్నారు. ఈ విషయంలో ప్రధాని పార్లమెంటును తప్పుదోవ పట్టించారా? అనే అంశంపై ‘హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌’ ఇప్పటికే విచారణ జరుపుతోంది. మంత్రులు ఎవరైనా ఉద్దేశపూర్వకంగా సభను తప్పుదోవ పట్టించినట్లు రుజువైతే రాజీనామా చేయాల్సి ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని