Ukraine Crisis: రష్యాలో ఫేస్‌బుక్‌పై పరిమితులు

తమ దేశంలో ప్రముఖ సామాజిక మాధ్యమం ‘ఫేస్‌బుక్‌’ వినియోగంపై పాక్షిక పరిమితులు విధిస్తున్నట్లు రష్యా అధికార వర్గాలు శుక్రవారం ప్రకటించాయి.

Published : 26 Feb 2022 09:40 IST

బ్రస్సెల్స్‌: తమ దేశంలో ప్రముఖ సామాజిక మాధ్యమం ‘ఫేస్‌బుక్‌’ వినియోగంపై పాక్షిక పరిమితులు విధిస్తున్నట్లు రష్యా అధికార వర్గాలు శుక్రవారం ప్రకటించాయి. ఉక్రెయిన్‌పై దాడి నేపథ్యంలో.. రష్యాకు మద్దతుగా కథనాలు అందిస్తున్న పలు మీడియా సంస్థల ఖాతాలపై ఫేస్‌బుక్‌ ఆంక్షల కొరడా ఝళిపించింది. వాటిలోని సమాచారానికి.. ‘నిరాధారమైనవి’ అంటూ ట్యాగ్‌లు జోడించింది. ఆంక్షలను ఎత్తివేయాలని తాము చేసిన డిమాండ్‌ను సామాజిక మాధ్యమ సంస్థ ఖాతరు చేయలేదని, అందుకే ఫేస్‌బుక్‌ వినియోగంపై పరిమితులు విధించామని రష్యా అధికారులు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని