Apple iPhone: ఫేస్‌ మాస్కు ఉన్నా ఐఫోన్‌ అన్‌లాక్‌

ఫేస్‌ మాస్కు తీయకుండానే ముఖం గుర్తింపుతో ఐఫోన్‌ను అన్‌లాక్‌ చేసే అప్‌డేట్‌ను ఆపిల్‌ సోమవారం విడుదల చేసింది. ఐఓఎస్‌ 15.4 పేరిట ఉన్న ఈ అప్‌డేట్‌తో ‘ఫేస్‌ ఐడీ విత్‌ ఎ మాస్క్‌’ అన్న ఆఫ్షన్‌ వెల్‌కమ్‌ స్క్రీన్‌పై

Updated : 16 Mar 2022 10:58 IST

కొత్త అప్‌డేషన్‌ విడుదల

హూస్టన్‌: ఫేస్‌ మాస్కు తీయకుండానే ముఖం గుర్తింపుతో ఐఫోన్‌ను అన్‌లాక్‌ చేసే అప్‌డేట్‌ను ఆపిల్‌ సోమవారం విడుదల చేసింది. ఐఓఎస్‌ 15.4 పేరిట ఉన్న ఈ అప్‌డేట్‌తో ‘ఫేస్‌ ఐడీ విత్‌ ఎ మాస్క్‌’ అన్న ఆఫ్షన్‌ వెల్‌కమ్‌ స్క్రీన్‌పై కనిపిస్తుంది. ఎయిర్‌ట్యాగ్‌ సెటప్, సిరి వాయిస్‌ వంటి పలు అదనపు ఫీచర్లు కూడా ఇదే అప్‌డేట్‌తో ఇన్‌స్టాల్‌ అవుతాయని కంపెనీ పేర్కొంది. ఐఫోన్‌ 12, 12 మినీ, 12 ప్రో, 12 ప్రో మాక్స్, ఐఫోన్‌ 13, 13 మినీ, 13 ప్రో, 13 ప్రో మాక్స్‌ మోడళ్లకు మాత్రమే ఈ అప్‌డేట్‌ అందుబాటులో ఉంటుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని