Wresting: ఆ నిషా నేను కాదు..
హరియాణాకు చెందిన యూనివర్శిటీ స్థాయి రెజ్లర్ నిషా దహియాతో పాటు ఆమె సోదరుడు సూరజ్ హత్యకు గురి కావడం కలకలం రేపింది. అయితే ఇటీవల సెర్బియాలోని బెల్గ్రేడ్లో జరిగిన
సోనిపట్: హరియాణాకు చెందిన యూనివర్శిటీ స్థాయి రెజ్లర్ నిషా దహియాతో పాటు ఆమె సోదరుడు సూరజ్ హత్యకు గురి కావడం కలకలం రేపింది. అయితే ఇటీవల సెర్బియాలోని బెల్గ్రేడ్లో జరిగిన అండర్-23 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలిచిన నిషా దహియా అనే మరో రెజ్లర్ హత్యకు గురైనట్లుగా మీడియాలో వార్తలు రావడంతో గందరగోళం నెలకొంది. ప్రపంచ స్థాయిలో సత్తా చాటిన నిషాను బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ కూడా అభినందించారు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఆ రెజ్లర్ హత్యకు గురైనట్లు వార్తలొచ్చాయి. కొన్ని గంటల తర్వాత ఆమె తనకేమీ కాలేదంటూ ఒక వీడియో రిలీజ్ చేసింది. రియో ఒలింపిక్స్‌లో కాంస్యం నెగ్గిన ప్రముఖ రెజ్లర్ సాక్షి మలిక్ కూడా ఆ వీడియోలో కనిపించింది. తాను ఉత్తరప్రదేశ్‌లోని గోండాలో జాతీయ ఛాంపియన్షిప్ కోసం సన్నద్ధమవుతున్నట్లు నిషా తెలిపింది. మరోవైపు సోనిపట్‌లో నిషా, అతడి సోదరుడి హత్యలకు సంబంధించి పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
10 గంటల పాటు డంప్‌యార్డ్‌లో ధనుష్.. నెట్టింట ప్రశంసలు
-
టాస్ ఓడితేనేం.. మ్యాచ్‌లు గెలుస్తున్నాం కదా: శ్రేయస్ అయ్యర్
-
ఇండీజీన్ ఐపీఓ ప్రారంభం.. రూ.1,842 కోట్ల సమీకరణ లక్ష్యం
-
హౌస్ కీపర్ ఇంట్లో.. రూ. కోట్లల్లో నోట్ల గుట్టలు..!
-
పంజాబ్‌తో మ్యాచ్.. ధోనీ రికార్డును అధిగమించిన రవీంద్ర జడేజా
-
ఈ వారమూ చిన్న చిత్రాలదే హవా.. థియేటర్/ఓటీటీ చిత్రాలివే!