upcoming movies: ఈ వారమూ చిన్న చిత్రాలదే హవా.. థియేటర్‌/ఓటీటీ చిత్రాలివే!

గతవారం వైవిధ్యమైన చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద అలరించగా, మే రెండో వారంలో చిన్న చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. మరి థియేటర్‌తో పాటు, ఓటీటీలో వస్తున్న చిత్రాలేంటో చూసేయండి.

Published : 06 May 2024 09:46 IST

రియలిస్టిక్‌గా ‘కృష్ణమ్మ’

సత్యదేవ్‌ కథానాయకుడిగా వి.వి.గోపాలకృష్ణ దర్శకత్వంలో రూపొందిన మాస్‌ యాక్షన్‌ చిత్రం ‘కృష్ణమ్మ’ (Krishnamma). అతీరా రాజ్‌ కథానాయిక.  ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సమర్పిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ మే 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. మంచి కథతో.. ఎంతో రియలిస్టిక్‌గా రూపొందించామని చిత్ర బృందం చెబుతోంది. టీజర్‌, ట్రైలర్‌ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.


ప్రశ్నించే ‘ప్రతినిధి’

నారా రోహిత్‌ కథానాయకుడిగా మూర్తి దేవగుప్తపు తెరకెక్కించిన చిత్రం ‘ప్రతినిధి 2’ (prathinidhi 2). ‘ప్రతినిధి’కి కొనసాగింపుగా రూపొందిన ఈ సినిమాలో సిరీ లెల్లా కథానాయిక. సప్తగిరి, దినేష్‌ తేజ్‌, జిషు సేన్‌ గుప్తా తదితరులు కీలక పాత్రలు పోషించారు. తొలుత ఏప్రిల్‌ 25న ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకున్నా, అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. ఇప్పుడు మే 10న విడుదల చేస్తున్నారు.  ‘ఒక్కసారి ఎక్కి కూర్చున్నాడంటే ఐదేళ్లు చెప్పింది చేయాల్సిందే, డిసైడ్‌ చేసుకో, నిన్ను ఎవరు పరిపాలించాలో...’ అంటూ ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి.


యథార్థ సంఘటనలతో..

‘ఉయ్యాల జంపాల’తో యువతను ఆకట్టుకున్న ద‌ర్శ‌కుడు విరించి వ‌ర్మ. కొన్నేళ్ల విరామం తర్వాత ఆయన దర్శకత్వంలో రూపొందిన పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌ మూవీ ‘జితేందర్‌రెడ్డి’ (Jithender Reddy). ‘బాహుబలి’తో గుర్తింపు తెచ్చుకున్న రాకేశ్‌వర్రే కథానాయకుడు. 1980లో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీని తీర్చిదిద్దారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ మే 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.


ఎమోషనల్‌ థ్రిల్లర్‌

మోహన్ భగత్ , సుప్రిత సత్యనారాయణ్ , భూషణ్ కళ్యాణ్ , రవీంద్ర విజయ్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘ఆరంభం’ (Aarambam). అజయ్ నాగ్ వి (Ajay Nag) దర్శకత్వం వహిస్తున్నారు. ఎమోషనల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం మే 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏవీటీ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై అభిషేక్ వీటీ నిర్మిస్తున్నారు.


‘ఏప్స్‌’ మళ్లీ వచ్చేస్తున్నాయి

‘రైజ్‌ ఆఫ్‌ ది ప్లానెట్‌ ఆఫ్‌ ది ఏప్స్‌’ ఫ్రాంఛైజీ మూవీలకు విశేష ఆదరణ ఉన్న సంగతి తెలిసిందే. మనుషులకు చింపాజీలకు మధ్య జరిగే యుద్ధం నేపథ్యంలో సాగే ఈ కథలు ఆద్యంతం ఉత్కంఠగా సాగుతాయి. ఇప్పుడు ఈ సిరీస్‌లో వస్తున్న నాలుగో చిత్రం ‘కింగ్‌డమ్‌ ఆఫ్‌ ది ప్లానెట్‌ ఆఫ్‌ ది ఏప్స్‌’ (kingdom of the planet of the apes). వెస్‌బాల్‌ దర్శకుడు. మే 10న ఈ సినిమా ఇంగ్లిష్‌తో పాటు, భారతీయ భాషల్లోనూ విడుదల కానుంది. సముద్రతీరంలో ఉండే ఏప్స్‌ను పాలిస్తున్న నియంత ప్రాక్సిమస్‌ సీజర్‌.. మనుషుల టెక్నాలజీ అన్వేషించడంతో పాటు, వారిని అంతం చేయాలనుకుంటుంది. తన సేనలతో కలిసి వెంటాడి మరీ కొందరిని చంపేస్తుంది. అన్ని విషయాల్లో తెలివిగా వ్యవహరించే నోవా అనే యువతిని కూడా హత్య చేయడానికి ప్రయత్నిస్తున్న సమయంలో సీజర్‌ సంతతికి చెందిన చింపాజీ వచ్చి అడ్డుకుంటుంది. ఈ చర్యతో ఆగ్రహించిన ప్రాక్సిమస్‌ సీజర్‌ ఏం చేసింది?నోవా, సీజర్‌ సంతతికి చెందిన చింపాజీ చేసిన పోరాటం ఏంటి?


ఈ వారం ఓటీటీ చిత్రాలు/సిరీస్‌లు

  • నెట్‌ఫ్లిక్స్‌
  • బోడ్కిన్‌ (వెబ్‌సిరీస్‌) మే 09
  • మదర్‌ ఆఫ్‌ ది బ్రైడ్‌ (హాలీవుడ్) మే 09
  • థాంక్యూ నెక్ట్స్‌ (వెబ్‌సిరీస్‌) మే 09
  • అమెజాన్‌ ప్రైమ్‌
  • ఆవేశం (మలయాళం) మే 09
  • ది గోట్‌(వెబ్‌ సిరీస్‌) మే 09
  • యోధ (హిందీ) మే 10
  • జీ5
  • 8ఏఎం. మెట్రో (హిందీ) మే 10
  • డిస్నీ+హాట్‌స్టార్‌
  • ఆల్‌ఆఫ్‌ అజ్‌ స్ట్రేంజర్స్‌ (హాలీవుడ్‌) మే 08
  • సోనీలివ్‌
  • అన్‌ దేఖీ 3 (హిందీ సిరీస్‌)మే 10
  • లయన్స్‌ గేట్‌ప్లే
  • ది మార్ష్‌ కింగ్స్‌ డాటర్‌ (హాలీవుడ్) మే 10
  • ఆపిల్‌ టీవీ ప్లస్‌
  • డార్క్‌ మేటర్‌ (వెబ్‌సిరీస్) మే 08
  • హాలీవుడ్‌ కాన్‌ క్వీన్‌ (వెబ్‌సిరీస్‌) మే 08
  • మాక్స్‌టన్‌ హాల్‌ (వెబ్‌సిరీస్‌) మే 09
  • ఆహా
  • రోమియో (తమిళ్‌)
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని