PV sindu: పద్మభూషణ్‌ అందుకున్న సింధు

భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ పి.వి.  సింధు పద్మభూషణ్‌ అవార్డు అందుకుంది.  సోమవారం రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా ఆమె ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని స్వీకరించింది. 2016 రియో ఒలింపిక్స్‌లో రజతం గెలిచిన

Updated : 09 Nov 2021 08:09 IST

దిల్లీ: భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ పి.వి.  సింధు పద్మభూషణ్‌ అవార్డు అందుకుంది.  సోమవారం రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా ఆమె ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని స్వీకరించింది. 2016 రియో ఒలింపిక్స్‌లో రజతం గెలిచిన సింధు.. ఈ ఏడాది జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన సంగతి తెలిసిందే. ఈ అవార్డు తనపై బాధ్యతను మరింత పెంచిందని  సింధు వ్యాఖ్యానించింది. ఆరుసార్లు ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌ మేరీకోమ్‌ పద్మవిభూషణ్‌ పురస్కారాన్ని అందుకుంది. భారత మాజీ పేస్‌ బౌలర్‌ జహీర్‌ఖాన్‌, మహిళల హాకీ జట్టు కెప్టెన్‌ రాణీ రాంపాల్‌, బెంబెం దేవి (ఫుట్‌బాల్‌), జీతూరాయ్‌ (షూటింగ్‌), తరుణ్‌దీప్‌ రాయ్‌ (ఆర్చరీ) మరికొందరు క్రీడాకారులు పద్మశ్రీ అందుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని