Sachin: సచిన్‌ @ 35

ఈ ఏడాది ట్విట్టర్‌లో అత్యంత ప్రభావశీలురైన వ్యక్తుల జాబితాలో క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందుల్కర్‌ తొలి 50 స్థానాల్లోపు నిలిచాడు. బ్రాండ్‌వాచ్‌ సంస్థ ప్రకటించిన ఈ జాబితాలో అతను 35వ

Updated : 10 Nov 2021 07:27 IST

ముంబయి: ఈ ఏడాది ట్విట్టర్‌లో అత్యంత ప్రభావశీలురైన వ్యక్తుల జాబితాలో క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందుల్కర్‌ తొలి 50 స్థానాల్లోపు నిలిచాడు. బ్రాండ్‌వాచ్‌ సంస్థ ప్రకటించిన ఈ జాబితాలో అతను 35వ ర్యాంకు సొంతం చేసుకున్నాడు. అమెరికా దిగ్గజ నటులు డ్వేన్‌ జాన్సన్‌, లియోనార్డో డికాప్రియోతో పాటు ఆ దేశ మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా భార్య మిచెల్లె కంటే కూడా సచిన్‌ మెరుగైన స్థానం దక్కించుకోవడం విశేషం. యుఎస్‌ గాయని టేలర్‌ స్విఫ్ట్‌ అగ్రస్థానం సొంతం చేసుకోగా.. భారత ప్రధాని మోడీ రెండో స్థానంలో ఉన్నారు. ‘‘పేదల కోసం పనిచేస్తూ సరైన విషయాల కోసం తన గొంతును సచిన్‌ వినిపిస్తున్నాడు. అతని నుంచి స్ఫూర్తి పొందిన అభిమానులు కూడా మంచి పనులు చేస్తూ అదే మార్గంలో సాగుతున్నారు. అతనితో ఒప్పందం కుదుర్చుకున్న వాణిజ్య సంస్థలు కూడా ఆ దిశగా ప్రచారం చేస్తున్నాయి’’ అని బ్రాండ్‌వాచ్‌ తన పరిశోధన నివేదికలో పేర్కొంది. గతంలో రాజ్యసభ ఎంపీగానూ పనిచేసిన సచిన్‌.. 2013 నుంచి యునిసెఫ్‌ దక్షిణాసియా ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని