Paralympics: భారత్‌కు మరో కాంస్యం

పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం దక్కింది. షూటింగ్‌లో

Updated : 31 Aug 2021 16:44 IST

టోక్యో: పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం దక్కింది. షూటింగ్‌లో సింగ్‌రాజ్‌ అధాన కాంస్య పతకం గెలుచుకున్నాడు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్‌హెచ్‌ 1 విభాగంలో 216.8 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచాడు. భారత్ తరఫున పాల్గొన్న మరో షూటర్‌ మనీశ్‌ అగర్వాల్ ఫైనల్స్‌లో ఏడో స్థానంతో సరిపెట్టుకొన్నారు. దీంతో పారాలింపిక్స్‌లో భారత్‌ సాధించిన పతకాల సంఖ్య ఎనిమిదికి పెరిగింది. ఈ పోటీల్లో చైనా క్రీడాకారుడు డిఫెడింగ్ ఛాంపియన్‌ చావో యాంగ్‌ (237.9 ‌) పారాలింపిక్ రికార్డు సృష్టించి స్వర్ణం సాధించగా, మరో చైనా క్రీడాకారుడు హువాంగ్ జింగ్‌ (237.5) రజతం అందుకున్నాడు.

షూటింగ్‌లో కాంస్య పతకం సాధించిన సింగ్‌రాజ్‌ అధానాకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి, తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ట్విటర్‌ ద్వారా అభినందనలు తెలిపారు.






Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని