T20 League : టీ20 లీగ్‌ షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు..

 టీ20 లీగ్‌ షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చేస్తూ భారత క్రికెట్‌ కంట్రోల్ బోర్డు (బీసీసీ) నిర్ణయం తీసుకుంది. ముంబయి, పుణె వేదికగా...

Published : 03 May 2022 20:09 IST

ప్రకటన విడుదల చేసిన బీసీసీఐ

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీ20 లీగ్‌ షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చేస్తూ భారత క్రికెట్‌ కంట్రోల్ బోర్డు (బీసీసీ) నిర్ణయం తీసుకుంది. ముంబయి, పుణె వేదికగా జరుగుతున్న లీగ్‌ మ్యాచ్‌లు ముగిశాక.. అసలైన సమరం మొదలు కానుంది. తొలి క్వాలిఫయర్‌ మ్యాచ్‌ మే 24న, ఎలిమినేటర్‌ మ్యాచ్‌ మే 25న, రెండో క్వాలిఫయర్‌ మ్యాచ్‌ మే 27న, ఫైనల్‌ మ్యాచ్‌ 29న జరగనుంది. ఇంతకుముందు ప్రకటించిన షెడ్యూల్‌లో ఎలిమినేటర్‌ మ్యాచ్‌ మే 26న జరగాల్సి ఉంది. దానిని ఒక రోజు ముందుకు మారుస్తూ బీసీసీఐ రీషెడ్యూల్‌ చేసింది. మే 22 వరకు లీగ్‌ దశ మ్యాచ్‌లు జరుగుతాయి.

మొదటి క్వాలిఫయర్‌తోపాటు ఎలిమినేటర్‌ మ్యాచ్‌లకు కోల్‌కతా వేదికగా నిలవనుంది. అదేవిధంగా రెండో క్వాలిఫయర్‌తోపాటు ఫైనల్‌ అహ్మదాబాద్‌లోని అతిపెద్ద స్టేడియంలో జరగనున్నాయి. ప్లేఆఫ్స్‌ సహా ఫైనల్‌కు వందశాతం ప్రేక్షకులను అనుమతిస్తామని ఇప్పటికే బీసీసీఐ తెలిపింది. మరోవైపు మహిళల టీ20 ఛాలెంజ్‌ వేదికలనూ బీసీసీఐ మార్పు చేసింది. గతంలో లఖ్‌నవూ స్టేడియంలో నిర్వహిద్దామని భావించినా.. ఆ మ్యాచ్‌లను పుణె వేదికగా నిర్వహించనున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. మే 23 నుంచి మే 26 వరకు లీగ్‌ మ్యాచ్‌లు.. 28న ఫైనల్‌ మ్యాచ్‌ ఉంటుందని బీసీసీఐ స్పష్టం చేసింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని