Cheteshwar Pujara: నేను ఎదుర్కొన్నవారిలో కఠినమైన బౌలర్‌ అతడే: పుజారా

ఆస్ట్రేలియా ఆటగాడు పాట్‌ కమిన్స్‌ తన కెరీర్‌లో ఎదుర్కొన్న అత్యంత కఠినమైన బౌలర్‌ అని భారత బ్యాటర్ ఛెతేశ్వర్‌ పుజారా తెలిపాడు.

Published : 24 Jan 2023 01:19 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: క్రికెట్‌లో తాను ఎదుర్కొన్న వారిలో ఆస్ట్రేలియా ఆటగాడు పాట్ కమిన్స్‌ అత్యంత కఠినమైన బౌలర్‌ అని భారత బ్యాటర్‌ ఛెతేశ్వర్‌ పుజారా వెల్లడించారు. మాజీ పేసర్లలో ఆస్ట్రేలియా దిగ్గజం గ్లెన్‌ మెక్‌గ్రాత్‌ బౌలింగ్‌లో ఆడాలని ఉందని చెప్పాడు. ప్రస్తుతం దేశవాళీ క్రికెట్‌లో సౌరాష్ట్ర తరఫున ఆడుతున్న పుజారా ఓ క్రీడా ఛానల్‌ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

* మీరు ఎదుర్కొన్నవారిలో అత్యంత కఠినమైన బౌలర్‌ ఎవరు?

అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటివరకూ నేను ఎదుర్కొన్న వారిలో ఆస్ట్రేలియా పేసర్‌ పాట్‌ కమిన్స్‌ అత్యంత కఠినమైన బౌలర్‌. ముఖ్యంగా ఆస్ట్రేలియా పిచ్‌లపై అతడు అత్యంత ప్రమాదకరం. అతడి బంతుల్ని ఎదుర్కోవడం చాలా కష్టం. వచ్చే నెల భారత్‌లో జరిగే బోర్డర్‌ గావస్కర్‌ ట్రోఫీలో వీరిద్దరూ తలపడనున్నారు. 

* మాజీ బౌలర్లలో ఎవరిని ఎదుర్కోవాలనుకుంటారు?

ఆస్ట్రేలియా దిగ్గజం గ్లెన్‌ మెక్‌గ్రాత్‌ బౌలింగ్‌ అంటే ఇష్టం. అతడి పేస్‌ని ఎదుర్కోవాలనుకుంటున్నా.

* కలలో ఎవరితో భాగస్వామ్యం నిర్మించాలనుకుంటారు?

‘వెస్టిండీస్‌ దిగ్గజం బ్రియాన్‌ లారా. గతంలో ఐపీఎల్‌లో భాగంగా ఉన్నప్పటికీ అతడితో కలిసి ఎప్పుడూ ఆడలేదు. కలలో అతడితో కలిసి భాగస్వామ్యం నిర్మిస్తాను’ అని పుజారా పేర్కొన్నాడు. ఐపీఎల్‌ 2023 సీజన్‌కు బ్రియాన్‌ లారా హైదరాబాద్‌ జట్టుకు ప్రధాన కోచ్‌గా వ్యవహరించనున్నాడు.

* టెస్టుల్లో ఎప్పటికీ గుర్తుండిపోయే మీ ఇన్నింగ్‌ ఏది?

సుదీర్ఘ ఫార్మాట్‌లో 2017లో ఆస్ట్రేలియాతో చేసిన 92 పరుగుల స్కోరు ఎప్పటికీ గుర్తుంటుంది.

 ఐపీఎల్‌లో ఎవరూ కొనుగోలు చేయకపోవడంతో పుజారా కొంతకాలంగా ఇంగ్లాండ్‌లో జరిగే కౌంటీ క్రికెట్‌లో పాల్గొంటున్నాడు. అక్కడ తన అద్భుతమైన ఫామ్‌తో రాణిస్తున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని