సురభి రజత గురి

కుమార్‌ సురేంద్ర సింగ్‌ స్మారక జాతీయ స్థాయి షూటింగ్‌ ఛాంపియన్‌షిప్స్‌లో తెలంగాణ షూటర్‌ సురభి భరద్వాజ్‌ మెరిసింది. మహిళల 50 మీటర్ల రైఫిల్‌ ప్రోన్‌ విభాగంలో ఆమె రజతం సొంతం చేసుకుంది.

Published : 10 Jun 2023 03:04 IST

తిరువనంతపురం: కుమార్‌ సురేంద్ర సింగ్‌ స్మారక జాతీయ స్థాయి షూటింగ్‌ ఛాంపియన్‌షిప్స్‌లో తెలంగాణ షూటర్‌ సురభి భరద్వాజ్‌ మెరిసింది. మహిళల 50 మీటర్ల రైఫిల్‌ ప్రోన్‌ విభాగంలో ఆమె రజతం సొంతం చేసుకుంది. 622.7 స్కోరుతో ఆమె రెండో స్థానాన్ని దక్కించుకుంది. ప్రియ (ఏఆర్‌ఎమ్‌యు) 624.5 స్కోరుతో పసిడి గెలుచుకుంది. మీనా కుమారి (హరియాణా- 621.7) కాంస్యం ఖాతాలో వేసుకుంది.

దీప్తికి మరో రజతం

విషి (ఫ్రాన్స్‌): ఫ్రాన్స్‌లో జరుగుతున్న వర్చుస్‌ గ్లోబల్‌ గేమ్స్‌లో తెలంగాణ అథ్లెట్‌ జీవంజి దీప్తి మరో రజతాన్ని కైవసం చేసుకుంది. ఇప్పటికే మహిళల 400 మీటర్ల (టీ20) పరుగులో వెండి పతకం గెలిచిన ఆమె.. శుక్రవారం 200 మీటర్ల పరుగులోనూ అదే ప్రదర్శన పునరావృతం చేసింది. 25.27 సెకన్లలో రేసు ముగించిన దీప్తి రెండో స్థానాన్ని దక్కించుకుంది. షులియర్‌ (ఉక్రెయిన్‌- 25.17సె), ఫెలిక్స్‌ బార్బోసా (బ్రెజిల్‌- 26.43సె) వరుసగా స్వర్ణ, కాంస్య పతకాలు నెగ్గారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు