Gautam Gambhir: అలా ధోనీని హీరోని చేసేశారు: గౌతమ్‌ గంభీర్‌ ఘాటు వ్యాఖ్యలు

2007, 2011 ప్రపంచకప్‌లలో సమష్టిగా రాణించడం వల్ల భారత్‌ విజేతగా నిలిస్తే.. కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీని హీరోను చేసేశారని ఆ జట్టులో సభ్యుడిగా ఉన్న గౌతమ్‌ గంభీర్‌ ఘాటుగా విమర్శించాడు.

Updated : 13 Jun 2023 07:18 IST

దిల్లీ: 2007, 2011 ప్రపంచకప్‌లలో సమష్టిగా రాణించడం వల్ల భారత్‌ విజేతగా నిలిస్తే.. కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీని హీరోను చేసేశారని ఆ జట్టులో సభ్యుడిగా ఉన్న గౌతమ్‌ గంభీర్‌ ఘాటుగా విమర్శించాడు. ప్రచార బృందం గట్టిగా పని చేయడం వల్లే ధోనికి ఆ పేరు వచ్చిందని గౌతి అన్నాడు. డబ్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత్‌ చిత్తుగా ఓడిన నేపథ్యంలో.. ఐసీసీ ట్రోఫీల్లో నెగ్గడం ధోనికే సాధ్యం అన్నట్లు అతడిని పొగుడుతూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వెల్లువెత్తడంతో గంభీర్‌ ఇలా స్పందించాడు. ‘‘ఐసీసీ టోర్నమెంట్లలో భారత్‌ వరుస వైఫల్యాలకు కారణం మనం వ్యక్తిగత ప్రదర్శనలకు ఇచ్చిన ప్రాధాన్యం జట్టు ప్రదర్శనకు ఇవ్వకపోవడం వల్లే. వేరే జట్లు మాత్రం సమష్టి ప్రదర్శనకు పెద్దపీట వేస్తాయి. 2007 టీ20 ప్రపంచకప్‌, 2011 వన్డే ప్రపంచకప్‌లో భారత్‌ విజేతగా నిలిచిందంటే ఆల్‌రౌండర్‌ యువరాజ్‌సింగే ప్రధాన కారణం. ఈ రెండు టోర్నీల్లోనూ యువీనే జట్టును ఫైనల్‌కు చేర్చాడు. కానీ పీఆర్‌ ఏజెన్సీ బృందాలు ధోనీని హీరోని చేసేశాయి’’ అని గంభీర్‌ పేర్కొన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని