Bhuvneshwar Kumar: భువి వీడ్కోలు పలకనున్నాడా?

టీమ్‌ఇండియా పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ ప్రొఫైల్‌ నుంచి ‘క్రికెటర్‌’ పదం తొలగించడం చర్చనీయాంశమవుతోంది.

Updated : 29 Jul 2023 07:19 IST

దిల్లీ: టీమ్‌ఇండియా పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ ప్రొఫైల్‌ నుంచి ‘క్రికెటర్‌’ పదం తొలగించడం చర్చనీయాంశమవుతోంది. ఇంతకుముందు భువి ప్రొఫైల్‌లో ‘ఇండియన్‌ క్రికెటర్‌’ ఉండగా.. శుక్రవారం అతను ‘ఇండియన్‌’గా మార్చాడు. దీంతో భువి అంతర్జాతీయ కెరీర్‌కు తెరపడినట్లేనా అన్న ఊహాగానాలు జోరందుకుంటున్నాయి. 33 ఏళ్ల భువి నిరుడు నవంబరులో న్యూజిలాండ్‌తో టీ20లో చివరి సారిగా భారత్‌కు ఆడాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరఫున 14 మ్యాచ్‌లు ఆడిన అతడికి.. వెస్టిండీస్‌లో పర్యటిస్తున్న భారత జట్టులో చోటు దక్కలేదు.  ఈనేపథ్యంలో భువి ఇన్‌స్టా ప్రొఫైల్‌లో మార్పునకు ప్రాధాన్యం ఏర్పడింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని