mohammed shami: ప్రాణం కాపాడిన షమి

భారత క్రికెట్‌ స్టార్‌ మహ్మద్‌ షమి ఓ ప్రాణాన్ని కాపాడాడు. నైనిటాల్‌లో రోడ్డు ప్రమాదానికి గురైన వ్యక్తికి సకాలంలో సాయం అందించి మానవత్వాన్ని చాటుకున్నాడు. ఈ విషయాన్ని షమి సామాజిక మాధ్యమంలో వెల్లడించాడు.

Updated : 27 Nov 2023 03:17 IST

నైనిటాల్‌: భారత క్రికెట్‌ స్టార్‌ మహ్మద్‌ షమి ఓ ప్రాణాన్ని కాపాడాడు. నైనిటాల్‌లో రోడ్డు ప్రమాదానికి గురైన వ్యక్తికి సకాలంలో సాయం అందించి మానవత్వాన్ని చాటుకున్నాడు. ఈ విషయాన్ని షమి సామాజిక మాధ్యమంలో వెల్లడించాడు. ‘‘అతడు చాలా అదృష్టవంతుడు. దేవుడు పునర్జన్మనిచ్చాడు. నైనిటాల్‌కు సమీపంలో ప్రయాణిస్తుండగా.. నా ముందు వెళ్తున్న కారు ఘాట్‌ రోడ్డులోంచి లోయలోకి పడిపోయింది. నాతో పాటు సమీపంలో ఉన్న కొందరు అతడికి సాయం చేసి ఆసుపత్రికి పంపించాం’’ అని షమి తెలిపాడు. తాజా ప్రపంచకప్‌లో 24 వికెట్లు తీసిన షమి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని