Rishabh Pant: కాలు పోగొట్టుకుంటానని భయపడ్డా: పంత్‌

కారు ప్రమాదం జరిగిన తర్వాత కాలు పోగొట్టుకుంటానేమోనని అని భయపడినట్లు స్టార్‌ బ్యాటర్‌ రిషబ్‌ పంత్‌ వెల్లడించాడు.

Updated : 02 Feb 2024 08:40 IST

దిల్లీ: కారు ప్రమాదం జరిగిన తర్వాత కాలు పోగొట్టుకుంటానేమోనని అని భయపడినట్లు  స్టార్‌ బ్యాటర్‌ రిషబ్‌ పంత్‌ వెల్లడించాడు. ‘‘కారు ప్రమాదానికి   గురై ఆసుపత్రిలో చేరిన తర్వాత నరాలు దెబ్బ తిన్నాయేమో అనుకున్నా. అదే జరిగితే కాలు తొలగించే అవకాశం ఉంటుంది. ఈ విషయం తలుచుకుంటే భయం వేసింది. ప్రమాదం తర్వాత కొందరు వచ్చి సాయం చేశారు. బాగా గాయాలైన విషయం గుర్తుంది. నా కాలు సరి చేయమని అక్కడ ఉన్న ఒకతన్ని అడిగాను. నా ఎస్‌యూవీ నుంచి వేరే కారుకు మార్చినట్టు మాత్రమే జ్ఞాపకముంది’’ అని పంత్‌ తెలిపాడు. పంత్‌ ప్రయాణిస్తున్న కారు ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన తర్వాత సమీపంలో ఉన్న రజత్‌ కుమార్‌, నిషు కుమార్‌ అతడిని ఎస్‌యూవీలోంచి బయటకు లాగారు. ఆ తర్వాత ఆ వాహనం మంటలకు ఆహుతైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని