మ్యాచ్‌లకు ముందు నిద్ర లేని రాత్రులు

తన 24 ఏళ్ల కెరీర్‌లో చాలా భాగం ఆదుర్దాకు గురయ్యానని క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందుల్కర్‌ అన్నాడు. ఓ కార్యక్రమం సందర్భంగా ...

Published : 17 May 2021 01:22 IST

దిల్లీ: తన 24 ఏళ్ల కెరీర్‌లో చాలా భాగం ఆదుర్దాకు గురయ్యానని క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందుల్కర్‌ అన్నాడు. ఓ కార్యక్రమం సందర్భంగా మానసిక ఆరోగ్యం గురించి అతను మాట్లాడుతూ..   ‘‘మ్యాచ్‌కు భౌతికంగానే కాదు మానసికంగానూ సన్నద్ధం కావాలని కాల క్రమంలో తెలుసుకున్నా. నేను మైదానంలో అడుగుపెట్టడానికి చాలా ముందే నా మదిలో మ్యాచ్‌ మొదలవుతుంది. ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది. దాదాపు 10-12 ఏళ్ల పాటు ఆదుర్దాకు గురయ్యా. మ్యాచ్‌లకు ముందు ఎన్నో నిద్రలేని రోజులు గడిపా. కానీ ఇది నా సన్నాహంలో భాగమని క్రమంగా ఆమోదించా. మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం కోసం ఏదో ఒకటి చేసేవాణ్ని. షాడో బ్యాటింగ్‌, టీవీ చూడడం, వీడియో గేమ్స్‌ ఆడడం లాంటివన్నమాట. ఉదయం టీ చేసుకోవడం కూడా మ్యాచ్‌కు సిద్ధం కావడానికి ఉపకరించేది. అలాగే బట్టలు ఇస్త్రీ చేసుకోవడం కూడా. మ్యాచ్‌కు ఒక రోజు ముందే నా బ్యాట్‌ సర్దుకునేవాణ్ని. మా అన్న నాకిది నేర్పించాడు. అది అలవాటుగా మారింది. భారత్‌కు ఆడిన చివరి మ్యాచ్‌ సందర్భంగా కూడా అదే చేశా’’ అని చెప్పాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని