పాక్‌తో పోరులో తీవ్ర ఒత్తిడి: భువి

పాకిస్థాన్‌తో ఎప్పుడు మ్యాచ్‌ జరిగినా తీవ్రమైన ఒత్తిడి ఉంటుందని టీమ్‌ఇండియా పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ అన్నాడు. టీ20 ప్రపంచకప్‌కు చాలా సమయం ఉందని.. మెగా టోర్నీ గురించి ఇప్పుడు ఆలోచించట్లేదని తెలిపాడు. ‘‘పాక్‌తో తలపడటం ఎల్లప్పుడూ ఉత్తేజకరమే.

Updated : 17 Jul 2021 10:56 IST

కొలంబో: పాకిస్థాన్‌తో ఎప్పుడు మ్యాచ్‌ జరిగినా తీవ్రమైన ఒత్తిడి ఉంటుందని టీమ్‌ఇండియా పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ అన్నాడు. టీ20 ప్రపంచకప్‌కు చాలా సమయం ఉందని.. మెగా టోర్నీ గురించి ఇప్పుడు ఆలోచించట్లేదని తెలిపాడు. ‘‘పాక్‌తో తలపడటం ఎల్లప్పుడూ ఉత్తేజకరమే. అత్యంత తీవ్రతతో జరిగే ఆ మ్యాచ్‌లో తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. అయితే ఆ మ్యాచ్‌ గురించి మేం ఆలోచించట్లేదు. టీ20 ప్రపంచకప్‌కు ముందు చాలా క్రికెట్‌ ఉంది. శ్రీలంకలో సిరీస్‌, ఇంగ్లాండ్‌లో టెస్టు మ్యాచ్‌లు, ఐపీఎల్‌ తర్వాతే ప్రపంచకప్‌. ఐపీఎల్‌ ముగియగానే ప్రపంచకప్‌ గురించి ఆలోచిస్తాం’’ అని భువి చెప్పాడు.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని