Dhoni - Hardik Pandya: ధోని నా జీవిత కోచ్‌: హార్దిక్‌ పాండ్య

ఫినిషర్‌గా ఈ టీ20 ప్రపంచకప్‌ను తన కెరీర్‌లోనే అతి పెద్ద బాధ్యతగా పరిగణిస్తున్నానని ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య అన్నాడు. ధోని లేకపోవడంతో ఫినిషింగ్‌ బాధ్యతంతా తన భుజాలపై పడడమే అందుకు కారణమని చెప్పాడు.

Published : 19 Oct 2021 07:37 IST

దుబాయ్‌: ఫినిషర్‌గా ఈ టీ20 ప్రపంచకప్‌ను తన కెరీర్‌లోనే అతి పెద్ద బాధ్యతగా పరిగణిస్తున్నానని ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య అన్నాడు. ధోని లేకపోవడంతో ఫినిషింగ్‌ బాధ్యతంతా తన భుజాలపై పడడమే అందుకు కారణమని చెప్పాడు. ‘‘ఈ ప్రపంచకప్‌ నాకు అతి పెద్ద బాధ్యత. ఎందుకంటే ఈసారి ధోని లేడు. అంతా నా భుజాలపైనే ఉంది. నేనలా ఆలోచించడానికి ఇష్టపడతా. ఎందుకంటే అది నాకు మరింత సవాలును విసురుతుంది. టీ20 ప్రపంచకప్‌ రసవత్తరంగా సాగబోతోంది. ధోని ఆరంభం నుంచి నన్ను బాగా అర్థం చేసుకున్నాడు. నేనెలా పని చేస్తానో, నేనెలాంటి వాడినో, నా అయిష్టాలేంటో.. ఇలా అన్నీ అతడికి తెలుసు’’ అని హార్దిక్‌ చెప్పాడు. 2019లో సస్పెన్షన్‌ తర్వాత జట్టులోకి వచ్చిన తర్వాత ధోని తనకు అండగా నిలిచాడని తెలిపాడు. ‘‘మొదట్లో హోటల్‌ గదులు (న్యూజిలాండ్‌ పర్యనటలో పాండ్యకు) లేవు. అప్పుడు నాకు ఫోన్‌ వచ్చింది. ‘‘మీరు రండి. ‘నేను మంచంపై పడుకోను. అతడు నా మంచంపై పడుకుంటాడు. నేను నేలపై పడుకుంటా’ అని ధోని చెప్పాడు’’ అని ఫోన్లో చెప్పారు. ధోని నాకు ఎప్పుడూ అండగా ఉంటాడు. నా గురించి అతడికి లోతుగా తెలుసు. అతడు నాకు బాగా సన్నిహితుడు. నన్ను ప్రశాంతంగా ఉంచగలిగే ఏకైక వ్యక్తి ధోనీనే. నా వ్యాఖ్యలపై వివాదం చెలరేగినప్పుడు నాకు ఎంతో మద్దతుగా నిలిచాడు. నా కెరీర్‌లో అలా ఎన్నో సార్లు మద్దతునిచ్చాడు. నేనెప్పుడూ అతణ్ని గొప్ప ధోనీగా చూడలేదు. నా వరకు అతడు అన్నయ్యే’’ అని చెప్పాడు. ‘‘చాలా విధాలుగా అతడు నాకు జీవిత కోచ్‌. అతడితో ఉండడం వల్ల పరిణతి సాధించా. అణకువగా ఉండడం నేర్చుకున్నా’’ అని హార్దిక్‌ అన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని