Jos Buttler: బట్లర్‌.. సూపర్‌ క్యాచ్‌ చూడండి..

ఆస్ట్రేలియాతో యాషెస్‌ రెండో టెస్టులో తొలిరోజు, గురువారం ఆటలో ఇంగ్లాండ్‌ వికెట్‌కీపర్‌ జోస్‌ బట్లర్‌ తన ఫీల్డింగ్‌ విన్యాసంతో అభిమానుల దృష్టిని ఆకర్షించాడు. పేసర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌ వేసిన ఇన్నింగ్స్‌ ఎనిమిదో

Updated : 17 Dec 2021 06:54 IST

ఆస్ట్రేలియాతో యాషెస్‌ రెండో టెస్టులో తొలిరోజు, గురువారం ఆటలో ఇంగ్లాండ్‌ వికెట్‌కీపర్‌ జోస్‌ బట్లర్‌ తన ఫీల్డింగ్‌ విన్యాసంతో అభిమానుల దృష్టిని ఆకర్షించాడు. పేసర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌ వేసిన ఇన్నింగ్స్‌ ఎనిమిదో ఓవర్లో లెగ్‌ సైడ్‌ పడిన మూడో బంతిని ఆసీస్‌ ఓపెనర్‌ హారిస్‌ వికెట్‌కీపర్‌, లెగ్‌ గల్లీ మధ్య నున్న ఖాళీ ప్రదేశంలోకి పుల్‌ చేశాడు. అయితే సూపర్‌మ్యాన్‌లా పూర్తి స్థాయి డైవ్‌ చేసిన బట్లర్‌  ఆ బంతిని ఒంటి చేత్తో పట్టేసి బ్యాట్స్‌మన్‌కి షాకిచ్చాడు. జోస్‌ చేసిన ఈ విన్యాసం సామాజిక మధ్యమాల్లో విస్తృతం అవుతోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని