Sourav Ganguly- Sachin Tendulkar: సచిన్‌ను కూడా తీసుకొస్తా.. కానీ

సచిన్‌, ద్రవిడ్‌, గంగూలీ, లక్ష్మణ్‌.. భారత క్రికెట్లో నలుగురు దిగ్గజాలు. ఒకే జట్టులో కలిసి ఆడి దేశానికి ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించారు. ఇప్పుడు కూడా కలిసి భారత క్రికెట్‌ను నడిపించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న సౌరభ్‌ గంగూలీ.

Updated : 18 Dec 2021 07:06 IST

దిల్లీ: సచిన్‌, ద్రవిడ్‌, గంగూలీ, లక్ష్మణ్‌.. భారత క్రికెట్లో నలుగురు దిగ్గజాలు. ఒకే జట్టులో కలిసి ఆడి దేశానికి ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించారు. ఇప్పుడు కూడా కలిసి భారత క్రికెట్‌ను నడిపించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న సౌరభ్‌ గంగూలీ.. ద్రవిడ్‌, లక్ష్మణ్‌ను వివిధ బాధ్యతల్లోకి తీసుకున్నాడు. ఇక త్వరలోనే సచిన్‌ను కూడా తీసుకొస్తానని చెబుతున్నాడు. అండర్‌-19, భారత- ఎ జట్లకు కోచ్‌గా, జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ) డైరెక్టర్‌గా పనిచేసిన ద్రవిడ్‌ను టీమ్‌ఇండియా కోచ్‌గా పని చేయాల్సిందిగా గంగూలీ ఒప్పించిన సంగతి తెలిసిందే. ఇక ద్రవిడ్‌ స్థానంలో లక్ష్మణ్‌ను ఎన్‌సీఏ డైరెక్టర్‌గా నియమించారు. ఇప్పుడిక సచిన్‌ వంతు వచ్చేలా కనిపిస్తోంది. ‘‘సచిన్‌ కచ్చితంగా ఓ విభిన్నమైన వ్యక్తి. ఇలాంటి వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాలని అనుకోడు. కానీ భారత్‌ క్రికెట్లో ఏదో ఒక రూపంలో కచ్చితంగా అతని భాగస్వామ్యం ఉండేలా చూస్తాం. కానీ ఏ మార్గంలో సచిన్‌ను తీసుకు రావాలి అనే విషయంపై దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఎటు చూసినా పరస్పర విరుద్ధ ప్రయోజనాల మాటే వినిపిస్తోంది.  ఏదో ఓ దశలో సచిన్‌ కూడా భారత్‌ క్రికెట్లోకి వచ్చేందుకు ఓ మార్గాన్ని కనుక్కుంటాడు’’ అని గంగూలీ చెప్పాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని