యువ భారత్‌ బోణీ

రికార్డు స్థాయిలో అయిదో సారి అండర్‌-19 ప్రపంచకప్‌ను దక్కించుకునే దిశగా యువ భారత్‌ తొలి అడుగు వేసింది. శనివారం గ్రూప్‌- బి మ్యాచ్‌లో పటిష్ఠమైన దక్షిణాఫ్రికాపై భారత కుర్రాళ్లు 45 పరుగుల తేడాతో గెలిచారు.

Published : 17 Jan 2022 05:04 IST

అండర్‌-19 ప్రపంచకప్‌

జార్జ్‌టౌన్‌: రికార్డు స్థాయిలో అయిదో సారి అండర్‌-19 ప్రపంచకప్‌ను దక్కించుకునే దిశగా యువ భారత్‌ తొలి అడుగు వేసింది. శనివారం గ్రూప్‌- బి మ్యాచ్‌లో పటిష్ఠమైన దక్షిణాఫ్రికాపై భారత కుర్రాళ్లు 45 పరుగుల తేడాతో గెలిచారు. మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 46.5 ఓవర్లలో 232 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్‌ యశ్‌ ధుల్‌ (82; 100 బంతుల్లో 11×4) బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు. 11 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ భారత్‌ను ఆంధ్ర కుర్రాడు రషీద్‌ (31)తో కలిసి యశ్‌ ఆదుకున్నాడు. ఈ జోడీ మూడో వికెట్‌కు 71 పరుగులు జోడించింది. ప్రత్యర్థి బౌలర్లలో మాథ్యూ (3/40), అఫివె (2/29), డెవాల్డ్‌ (2/43) ఆకట్టుకున్నారు. అనంతరం ఛేదనలో స్పిన్నర్‌ విక్కీ (5/28), పేసర్‌ రాజ్‌ బవా (4/47) ధాటికి దక్షిణాఫ్రికా 45.4 ఓవర్లలో 187 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టులో డెవాల్డ్‌ బ్రెవిస్‌ (65; 99 బంతుల్లో 6×4, 2×6) మాత్రమే రాణించాడు. ఛేదనలో డెవాల్డ్‌ పోరాటంతో ప్రత్యర్థి ఓ దశలో 138/3తో లక్ష్యం దిశగా సాగుతున్నట్లు కనిపించింది. కానీ గొప్పగా రాణించిన భారత బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టారు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని