విజేత లక్ష్యసేన్‌

ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకంతో మెరిసిన భారత యువ ఆటగాడు లక్ష్యసేన్‌ సొంతగడ్డపైనా సత్తాచాటాడు. ప్రపంచ ఛాంపియన్‌ కీన్‌ యూ (సింగపూర్‌)ను చిత్తుచేసి ఇండియా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో విజేతగా నిలిచాడు.

Published : 17 Jan 2022 05:05 IST

సాత్విక్‌ జోడీకి టైటిల్‌
ఇండియా ఓపెన్‌

దిల్లీ: ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకంతో మెరిసిన భారత యువ ఆటగాడు లక్ష్యసేన్‌ సొంతగడ్డపైనా సత్తాచాటాడు. ప్రపంచ ఛాంపియన్‌ కీన్‌ యూ (సింగపూర్‌)ను చిత్తుచేసి ఇండియా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో మూడో సీడ్‌ లక్ష్యసేన్‌ 24-22, 21-17తో కీన్‌ యూపై విజయం సాధించాడు. ఇటీవల ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో కీన్‌ యూ స్వర్ణం గెలవగా.. లక్ష్యసేన్‌ కాంస్యం నెగ్గాడు. ఇక భారత అగ్రశ్రేణి డబుల్స్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజు- చిరాగ్‌ శెట్టి తన ఖాతాలో మరో టైటిల్‌ వేసుకుంది. మూడు సార్లు ప్రపంచ ఛాంపియన్స్‌, రెండో ర్యాంకర్‌ జోడీకి షాకిచ్చి విజేతగా నిలిచింది. ఫైనల్లో సాత్విక్‌- చిరాగ్‌ జోడీ 21-16, 26-24తో ఎహసాన్‌- సెతియవన్‌ (ఇండోనేసియా) జంటపై నెగ్గింది. ‘‘ఇప్పటికీ నమ్మలేకపోతున్నాం. ఎప్పటికీ నిలిచిపోయే ఉత్తమమైన మ్యాచ్‌ల్లో ఇదొకటని అనుకుంటున్నాం’’ అని సాత్విక్‌ అన్నాడు.మహిళల సింగిల్స్‌ ఫైనల్లో బుసానన్‌ (థాయ్‌లాండ్‌) 22-20, 19-21, 21-13తో సుపనిద (థాయ్‌లాండ్‌)పై గెలిచింది. శనివారం సెమీఫైనల్లో పి.వి.సింధు 14-21, 21-13, 10-21తో సుపనిద చేతిలో ఓడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని