హాకీ జట్టులో 16 మందికి పాజిటివ్‌

భారత క్రీడాప్రాధికార సంస్థ (సాయ్‌) జాతీయ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌లో కరోనా ప్రకంపనలు సృష్టిస్తోంది. శుక్రవారం భారత పురుషుల హాకీ జట్టులో 16 మంది పాజిటివ్‌గా తేలారు. 128 పరీక్షలు

Published : 22 Jan 2022 03:35 IST

బెంగళూరు: భారత క్రీడాప్రాధికార సంస్థ (సాయ్‌) జాతీయ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌లో కరోనా ప్రకంపనలు సృష్టిస్తోంది. శుక్రవారం భారత పురుషుల హాకీ జట్టులో 16 మంది పాజిటివ్‌గా తేలారు. 128 పరీక్షలు నిర్వహించగా.. మొత్తం 33 మందికి పాజిటివ్‌ వచ్చింది. ‘‘సీనియర్‌ హాకీ జట్టులో 16 మంది ఆటగాళ్లు, ఒక కోచ్‌ పాజిటివ్‌గా తేలారు. దక్షిణాఫ్రికాలో జరిగే ఎఫ్‌ఐహెచ్‌ ప్రొ లీగ్‌ కోసం జట్టు శిక్షణ తీసుకుంటోంది. ఆటగాళ్లు, కోచ్‌కు ఎలాంటి లక్షణాలు లేవు’’ అని సాయ్‌ ప్రకటించింది. జూనియర్‌ మహిళల హాకీ జట్టులో 15 మందికి పాజిటివ్‌ వచ్చింది. ఒక సీనియర్‌ హాకీ క్రీడాకారిణి కూడా పాజిటివ్‌గా తేలింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని