విశాఖ నుంచి తరలిన మ్యాచ్‌

వెస్టిండీస్‌తో టీ20 మ్యాచ్‌ను ఆస్వాదిద్దామనుకున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు బీసీసీఐ చేదువార్త చెప్పింది. కరోనా విజృంభణ నేపథ్యంలో విశాఖపట్నంలో జరగాల్సిన మ్యాచ్‌ను తరలించింది. వచ్చే నెలలో వెస్టిండీస్‌తో జరిగే పరిమిత

Published : 23 Jan 2022 01:46 IST

దిల్లీ: వెస్టిండీస్‌తో టీ20 మ్యాచ్‌ను ఆస్వాదిద్దామనుకున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు బీసీసీఐ చేదువార్త చెప్పింది. కరోనా విజృంభణ నేపథ్యంలో విశాఖపట్నంలో జరగాల్సిన మ్యాచ్‌ను తరలించింది. వచ్చే నెలలో వెస్టిండీస్‌తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌ను రెండు నగరాలకే పరిమితం చేసింది. వైరస్‌ నేపథ్యంలో జట్లకు ప్రయాణ భయం ఉండకూడదనే కారణంతో నిర్ణయం తీసుకున్నట్లు శనివారం ప్రకటించింది. సవరించిన షెడ్యూల్‌ ప్రకారం విండీస్‌తో టీమ్‌ఇండియా ఆడాల్సిన మూడు వన్డేలు అహ్మదాబాద్‌లో, టీ20లు కోల్‌కతాలో జరుగుతాయి. వచ్చే నెల 6, 9, 11 తేదీల్లో వన్డేలు, 16, 18, 20 తేదీల్లో టీ20లను బీసీసీఐ నిర్వహిస్తుంది. మొదట ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం వన్డేలు వరుసగా అహ్మదాబాద్‌, జైపుర్‌, కోల్‌కతాలో.. టీ20లు కటక్‌, విశాఖపట్నం, తిరువనంతపురంలో జరగాల్సింది. 18న విశాఖలో టీ20 ఉండాల్సింది. కానీ మహమ్మారి వల్ల మ్యాచ్‌లను రెండు వేదికలకే పరిమితం చేయక తప్పలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని