Team India: కుల్‌దీప్‌ పునరాగమనంఅంత సులువు కాదు

టీమ్‌ఇండియా వన్డే జట్టులోకి తిరిగొచ్చిన స్పిన్నర్‌ కుల్‌దీప్‌యాదవ్‌కు ముందున్నదంతా కఠిన మార్గమేనని మాజీ ఆటగాడు హర్భజన్‌సింగ్‌ అన్నాడు. ఎలాంటి మ్యాచ్‌ ప్రాక్టీస్‌ లేకుండా బరిలో దిగడం కుల్‌దీప్‌కు

Updated : 28 Jan 2022 07:46 IST

దిల్లీ: టీమ్‌ఇండియా వన్డే జట్టులోకి తిరిగొచ్చిన స్పిన్నర్‌ కుల్‌దీప్‌యాదవ్‌కు ముందున్నదంతా కఠిన మార్గమేనని మాజీ ఆటగాడు హర్భజన్‌సింగ్‌ అన్నాడు. ఎలాంటి మ్యాచ్‌ ప్రాక్టీస్‌ లేకుండా బరిలో దిగడం కుల్‌దీప్‌కు కష్టంగా మారుతుందని తెలిపాడు. నిరుడు సెప్టెంబరులో ఐపీఎల్‌ సందర్భంగా గాయపడిన కుల్‌దీప్‌.. సొంతగడ్డపై వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు టీమ్‌ఇండియా జట్టులో చోటు సంపాదించాడు. ‘‘కుల్‌దీప్‌ ముందున్నదంతా కఠినమైన మార్గం. గత కొంతకాలంగా అతను దేశవాళీ మ్యాచ్‌లు ఆడలేదు. అంతర్జాతీయ క్రికెట్లో పునరాగమనం చేయడం అంత సులువు కాదు. మోకాలి   శస్త్రచికిత్సకు ముందు కూడా అతను క్రమం తప్పకుండా ఆడలేదు. పరిమిత ఓవర్ల క్రికెట్లో పునరాగమనం చేస్తున్నప్పుడు మెదడులో వచ్చే మొదటి ఆలోచన.. నా బౌలింగ్‌లో   బాదకూడదు అనే. ఇది మానసిక దృఢత్వానికి పరీక్ష’’ అని భజ్జీ చెప్పాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని