Sourav Ganguly: కెప్టెన్సీ కన్నా.. బీసీసీఐని నడిపించడం కష్టమేమీ కాదు

బీసీసీఐని నడపడం టీమ్‌ ఇండియాకు నాయకత్వం వహించడం కన్నా కష్టమైందేమీ కాదని బోర్డు అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ అభిప్రాయపడ్డాడు. ‘‘బీసీసీఐ అధ్యక్షుడిగా ఉండడం.. కెప్టెన్‌గా భారత

Updated : 04 Feb 2022 07:44 IST

ముంబయి: బీసీసీఐని నడపడం టీమ్‌ ఇండియాకు నాయకత్వం వహించడం కన్నా కష్టమైందేమీ కాదని బోర్డు అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ అభిప్రాయపడ్డాడు. ‘‘బీసీసీఐ అధ్యక్షుడిగా ఉండడం.. కెప్టెన్‌గా భారత జట్టును నడిపించడం కన్నా సవాలుతో కూడుకున్నదని నేను భావించట్లేదు. బోర్డు అధ్యక్షుడిగా నేను ఎలా పనిచేశానన్నది జనమే చెప్పాలి. అయితే కరోనా కారణంగా గత రెండేళ్లు కఠిన పరిస్థితుల్లో పనిచేశాం. మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేసింది. చాలా వరకు క్రికెట్‌ కొనసాగేలా చూడగలగడం మా అదృష్టం’’ అని ఓ ఇంటర్వ్యూలో గంగూలీ చెప్పాడు. కరోనా తీవ్రత మరీ పెరిగితే తప్ప 2022 ఐపీఎల్‌ను భారత్‌లోనే నిర్వహిస్తామని అతడు స్పష్టం చేశాడు. ‘‘కరోనా తీవ్రత విపరీతంగా పెరిగితే తప్ప ఐపీఎల్‌ భారత్‌లో జరుగుతుంది. లీగ్‌ దశ మ్యాచ్‌లను ముంబయి, పుణేల్లో నిర్వహించాలని భావిస్తున్నాం. నాకౌట్‌ మ్యాచ్‌లపై తర్వాత నిర్ణయం తీసుకుంటాం’’ అని గంగూలీ చెప్పాడు. ఈ ఏడాది మహిళల ఐపీఎల్‌ (నిరుడు జరగలేదు) ఉంటుందని తెలిపాడు. ‘‘ఈ ఏడాది మేలో మహిళల టీ20 ఛాలెంజ్‌ను నిర్వహిస్తాం. మహిళా క్రికెటర్ల సంఖ్య పెరిగితే భవిష్యత్తులో పెద్ద టోర్నీని నిర్వహిస్తామని ఆశిస్తున్నాం. ఈ ఏడాది మాత్రం ఐపీఎల్‌ ప్లేఆఫ్స్‌ సందర్భంగా మహిళల టీ20 ఛాలెంజ్‌ ఉంటుంది’’ అని గంగూలీ చెప్పాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని