IPL 2022: ఐపీఎల్‌ మెగా టోర్నీలో 55 మ్యాచ్‌లు ముంబయిలోనే!

మెగా వేలం పూర్తయిన నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టీ ఐపీఎల్‌పైనే. బీసీసీఐ ఇంకా అధికారికంగా టోర్నమెంట్‌ షెడ్యూలు విడుదల చేయనప్పటికీ లీగ్‌ మ్యాచ్‌లకు ముంబయి, పుణేలు వేదికలుగా ఖరారైనట్లు తెలుస్తోంది. ముంబయిలోని వాంఖడే స్టేడియం,

Updated : 24 Feb 2022 08:47 IST

ముంబయి: ఐపీఎల్‌ 2022 మెగా వేలం పూర్తయిన నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టీ ఆ టోర్నీపైనే నెలకొంది. బీసీసీఐ ఇంకా అధికారికంగా టోర్నమెంట్‌ షెడ్యూలు విడుదల చేయనప్పటికీ లీగ్‌ మ్యాచ్‌లకు ముంబయి, పుణేలు వేదికలుగా ఖరారైనట్లు తెలుస్తోంది. ముంబయిలోని వాంఖడే స్టేడియం, బ్రబోర్న్‌ స్టేడియం, డీవై పాటిల్‌ స్టేడియాల్లో మొత్తం 55 మ్యాచ్‌లు.. పుణేలోని ఎంసీఏ ఇంటర్నేషనల్‌ స్టేడియంలో 15 మ్యాచ్‌లు నిర్వహించనున్నట్లు సమాచారం. మార్చి 26న టోర్నీ మొదలయ్యే అవకాశముంది. మే 29న జరిగే ఫైనల్‌తో టోర్నీ ముగుస్తుంది. ప్లేఆఫ్స్‌ వేదికలు ఇంకా ఖరారు కాలేదు. షెడ్యూలుపై గురువారం జరిగే ఐపీఎల్‌ పాలకవర్గ సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది. రెండు కొత్త ఫ్రాంఛైజీల చేరికతో ఐపీఎల్‌ జట్ల సంఖ్య పదికి పెరిగిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని