పంజాబ్‌ కింగ్స్‌ సారథిగా మయాంక్‌

ఈ ఐపీఎల్‌ సీజన్లో పంజాబ్‌ కింగ్స్‌ సారథిగా మయాంక్‌ అగర్వాల్‌ వ్యవహరించనున్నాడు. జట్టును మయాంక్‌ నడిపించబోతున్నట్లు సోమవారం పంజాబ్‌ ఫ్రాంఛైజీ అధికారికంగా వెల్లడించింది. ‘‘2018 నుంచి పంజాబ్‌తో ఉన్నా. 

Updated : 01 Mar 2022 07:20 IST

దిల్లీ: ఈ ఐపీఎల్‌ సీజన్లో పంజాబ్‌ కింగ్స్‌ సారథిగా మయాంక్‌ అగర్వాల్‌ వ్యవహరించనున్నాడు. జట్టును మయాంక్‌ నడిపించబోతున్నట్లు సోమవారం పంజాబ్‌ ఫ్రాంఛైజీ అధికారికంగా వెల్లడించింది. ‘‘2018 నుంచి పంజాబ్‌తో ఉన్నా. జట్టుకు ఆడడాన్ని చాలా ఆస్వాదించా. ఇప్పుడు సారథ్యం వహించబోతుండడం మంచి అవకాశంగా భావిస్తున్నా. ఈ సీజన్లో జట్టులో ఉన్న ప్రతిభావంతులు నా పనిని మరింత సులభం చేస్తారని ఆశిస్తున్నా’’ అని మయాంక్‌ చెప్పాడు. ‘‘మయాంక్‌ సారథ్యంలో జట్టును మరింత బలోపేతం చేయాలని భావిస్తున్నాం. కెప్టెన్‌కు ఉండాల్సిన అన్ని లక్షణాలు అతడికి ఉన్నాయి. మయాంక్‌తో పని చేయడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నా’’ అని పంజాబ్‌ కోచ్‌ అనిల్‌ కుంబ్లే పేర్కొన్నాడు. గతంలో వైస్‌ కెప్టెన్‌గా పని చేసిన మయాంక్‌.. రెగ్యులర్‌ సారథి కేఎల్‌ రాహుల్‌ గైర్హాజరు అయిన సమయంలో కొన్ని మ్యాచ్‌ల్లో పంజాబ్‌ను నడిపించాడు. ఇప్పటి వరకు కెప్టెన్‌గా పని చేసిన కేఎల్‌ రాహుల్‌ 2022 సీజన్‌లో లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌కు సారథ్యం వహించనున్నాడు. 2011లో ఐపీఎల్‌ అరంగేట్రం చేసిన అగర్వాల్‌.. గత రెండు సీజన్లలో 400 పరుగుల పైన సాధించాడు. ఈసారి మెగా వేలంలో మయాంక్‌తో పాటు పేసర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ను పంజాబ్‌ తిరిగి దక్కించుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని